Gold Price Today: వామ్మో.. ఏంటీ బంగారం దూకుడు. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలిస్తే.

మంగళవారం పెరిగిన ధరలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ట్రెండ్స్‌ చూస్తే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే రోజుల్లో శుభకార్యాలు ఉండడం, మున్ముందు దసరా, దీపావళి పండుగలు ఉండడం కూడా బంగారం ధరలు పెరిగిందేకు అవకాశం ఉన్నట్లు...

Gold Price Today: వామ్మో.. ఏంటీ బంగారం దూకుడు. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందో తెలిస్తే.
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 19, 2023 | 6:22 AM

బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిందని సంతోషించేలోపే బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. సోమవారం స్వల్పంగా పెరిగిన బంగారం ధర, మంగళవారం రోజు జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. ఒక్క రోజే తులంపై ఏకంగా రూ. 150 వరకు పెరగడం గమనార్హం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.

మంగళవారం పెరిగిన ధరలతో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ట్రెండ్స్‌ చూస్తే రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వచ్చే రోజుల్లో శుభకార్యాలు ఉండడం, మున్ముందు దసరా, దీపావళి పండుగలు ఉండడం కూడా బంగారం ధరలు పెరిగిందేకు అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడ చూద్దాం..

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,440కి చేరింది. ఇక ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,210గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,080గా ఉంది. ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,080వద్ద కొనసాగుతోంది. అలాగే వరంగల్‌లో 22 క్యారెట్స్‌ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,080 వద్ద కొనసాగుతోంది. విజయవాడ విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్స్ ధర రూ. 55,050, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 25 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60,050గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇక బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపిస్తే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. మంగళవారం కిలో వెండిపై ఏకంగా రూ. 200 తగ్గడం విశేషం. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 74,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000, ముంబయిలో రూ. 74,500, బెంగళూరులో 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 78,200గా ఉండగా విజయవాడ, విశాఖపట్నంలోనూ మంగళవారం కిలో వెండి ధర రూ. 78,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..