Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acer Electric Scooter: ఈవీ రంగంలోకి దూసుకొచ్చిన ఏసర్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. క్షణాల్లో బ్యాటరీ మార్చేసుకోవచ్చు..

తైవాన్ కు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ కార్పొరేషన్ ఏసర్ ఆటో రంగంలోకి అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ వేరియంట్ టూ వీలర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అందుకు ఇండియాలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్ ఫారం ఈబైక్ గో కంపెనీతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు కలసి సంయుక్తంగా ఏసర్ మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేశాయి. ముఖ్యంగా అర్బన్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

Acer Electric Scooter: ఈవీ రంగంలోకి దూసుకొచ్చిన ఏసర్.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. క్షణాల్లో బ్యాటరీ మార్చేసుకోవచ్చు..
Acer Muvi 125 4g Electric Scooter
Follow us
Madhu

|

Updated on: Sep 19, 2023 | 12:06 PM

ఏసర్ అనగానే మనకు ల్యాప్ టాప్ లు కంప్యూటర్లు గుర్తుకువస్తాయి. కానీ తైవాన్ కు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ కార్పొరేషన్ ఏసర్ ఆటో రంగంలోకి అడుగుపెట్టింది. ఎలక్ట్రిక్ వేరియంట్ టూ వీలర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అందుకు ఇండియాలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్ ఫారం ఈబైక్ గో కంపెనీతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు కలసి సంయుక్తంగా ఏసర్ మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేశాయి. ముఖ్యంగా అర్బన్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఎవరైతే అధిక పనితీరుతో పటు ఎకో ఫ్రెండ్లీ వాహనాలు కోరుకుంటారో వారికి బెస్ట్ ఎంపికగా ఉంటుందని ఆ కంపెనీలు ప్రకటించాయి. ఏసర్ కంపెనీతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఈ మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ తో పాటు తయారీని మన దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ఈబైక్ గో చేపడుతోంది. ఈ మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లు..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యూరోపియన్ టెక్నాలజీతో రూపొందింది. దీనిలో స్వాపబుల్ బ్యాటరీలు ఉంటాయి. అంటే క్షణాల్లో బ్యాటరీను మార్చుకోవచ్చు. బ్యాటరీ చార్జింగ్ అయిపోతే.. దగ్గరలోని బ్యాటరీ స్టేషన్ వద్దకు వెళ్లి మీ బ్యాటరీని అక్కడ చార్జింగ్ పెట్టి.. మరో ఫుల్ చార్జ్ అయిన బ్యాటరీని తీసుకెళ్లిపోవచ్చు. లైట్ వెయిట్ ఛాసిస్, 16 అంగుళాల చక్రాలు, డేటాతో కూడిన డిజైన్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లు ఉంటాయి. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీనిలో బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర ఎంత ఉంటుంది అనే విషయం ఇంకాకంపెనీ వెల్లడి చేయలేదు. త్వరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది కానీ ఇప్పుడు వచ్చేది వెల్లడించలేదు. ఈ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఒకినావా, హీరో ఎలక్ట్రిక్, ఆంపియర్, ఒకాయా, జాయ్ ఈ-బైక్స్, హోప్, గోదావరి, ప్యూర్ ఈవీ వంటి మోడళ్లకు పోటీనిచ్చే అవకాశం ఉంది.

ఈబైక్ గో కృషి అభినందనీయం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈబైక్ గో చేస్తున్న నిరంతర ప్రయత్నాలను కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. ఏసర్ బ్రాండెడ్ మువీ-125-4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఈ రంగంలో స్థిరమైన వృద్ధి దిశగా వేస్తున్న అడుగులను సూచిస్తోందన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో రవాణా పరిష్కారాలను అందించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ఈబైక్ గో వంటి కంపెనీల ఆవిష్కరణ సామర్థ్యం.. వారి నిబద్ధత ఆదర్శనీయం అన్నారు. ఇలాంటి వాటి ద్వారా దేశానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రవాణా రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు తోడ్పాటునందిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..