Gogoro Electric Scooter: చూస్తే చాలు కొనేస్తాం.. క్యూట్ లుక్‪తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్ పై 97 కి.మీలు..

ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీదారు గొగొరో తన రెండు విద్యుత్ శ్రేణి స్కూటర్లను భారతీయ మార్కెట్లో కి తీసుకొచ్చింది. మార్చుకోదగిన బ్యాటరీలను అందించడంలో అగ్రశ్రేణి కంపెనీగా గొగొరో కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Gogoro Electric Scooter: చూస్తే చాలు కొనేస్తాం.. క్యూట్ లుక్‪తో ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్ పై 97 కి.మీలు..
Gogoro 2 Series
Follow us
Madhu

|

Updated on: Mar 30, 2023 | 12:15 PM

విద్యుత్ శ్రేణి వాహనాల్లో గ్లోబల్ వైడ్ గా చాలా దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. కానీ మన దేశంలో మాత్రం చాలా తక్కువ పెద్ద కంపెనీలకు చెందిన వాహనాలే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనే ది బెస్ట్ ను వినియోగదారులు ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన మరో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీదారు గొగొరో తన రెండు విద్యుత్ శ్రేణి స్కూటర్లను భారతీయ మార్కెట్లో కి తీసుకొచ్చింది. మార్చుకోదగిన బ్యాటరీలను అందించడంలో అగ్రశ్రేణి కంపెనీగా గొగొరో కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇది ఇప్పుడు విజయవంతమైన హోమోలోగేషన్ సర్టిఫికేషన్ తో గొగొరో2, గొగొరో 2 ప్లస్ సిరీస్ ను మన దేశంలో అడుగు పెడుతోంది. ఈ వాహనాలను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ఇన్‌స్టిట్యూట్ ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

  • తైవాన్‌లోని గొగొరో కంపెనీ ప్లాంట్‌లో ఈ వాహనాలు సీపీయూ(కంప్లీట్లీ బిల్డ్ యూనిట్లు)గా తయారు చేసి, అసెంబ్లింగ్ చేసిన తర్వాత మన దేశంలోని తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.
  • గొగొరో 2, 2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ గరిష్టంగా 87 kmph వేగంతో ప్రయాణించగలగుతాయి.
  • గొగొరో పవర్ అవుట్ పుట్ 7.2 kW, గొగొరో 2 ప్లస్ 6.4 kW అందిస్తాయి.గొగొరో 2 సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్లు, 2 ప్లస్ వాహనం 97 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
  • రెండు ఇ-స్కూటర్‌లు 1295 మిమీ పొడవాటి వీల్‌బేస్‌ను కలిగి ఉన్నాయి, ఇది టీవీఎస్ జూపిటర్ 125 కంటే పొడవుగా ఉంటుంది. దాని పొడవు 1275మిమీ.
  • వాహనాల బరువు ఒక్కొక్కటి 273కిలోలు.

అసలు రేంజ్ ఇది..

గొగొరో వాహనాల సాధారణ రేంజ్ సింగిల్ చార్జ్ పై 170కిమీ. అయితే భారతదేశంలో మాత్రం ఇది 84 కిలోమీటర్లు, 97 కిలోమీటర్లుగా ఉంది. దీనికి కారణం ఇతర దేశాలలో ఈ బైక్ కి రెండు మార్చుకోదగిన బ్యాటరీలు వస్తాయి. దీంతో అది ఎక్కువ కిలోమీటర్లు వస్తుంది. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఒక బ్యాటరీకి మాత్రమే సర్టిఫికేషన్ తీసుకుంది. అందువల్ల మైలేజీ తక్కువగా ఉంది.

లుక్.. డిజైన్..

గొగొరో 2 ప్లస్ బైక్ అనేక రకాల భద్రత, సౌకర్యాల ఫీచర్లను కలిగి ఉంది. దీని టైర్ లో ఉండే ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మీకు ఎల్లప్పుడూ సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు అద్భుతమైన స్టాపింగ్ పవర్‌ను అందిస్తాయి. భద్రతా లక్షణాలతో పాటు గొగొరో 2 ప్లస్ ప్రీమియం లుక్ అదరగొడుతుంది. నిగనిగలాడే మెటాలిక్ బాడీ ప్యానెల్‌లు, మెటాలిక్ సీట్ బ్యాడ్జ్ చూపరులను కట్టిపడేస్తాయి. డ్యూయల్-టోన్ ఫినిష్డ్ డ్యాష్‌బోర్డ్ బైక్ కి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

హీరో, బెల్రిస్ తో కలిసి..

గొగొరో కంపెనీ హీరో మోటార్ కార్ప్ తో కలిసి విడి వీ1 ప్రో బైక్ ను ఆధునికీకరిస్తోంది. దీనిలో స్వాపబుల్ బ్యాటరీ సాంకేతికతను అందిస్తోంది. అలాగే ఆటోమొబైల్ సిస్టమ్ తయారీదారులలో అగ్రగామిగా ఉన్న బెల్రిస్ స్మార్ట్ బ్యాటరీ-స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిపై గొగొరో ఇండస్ట్రీస్‌తో కలిసి పనిచేస్తోంది.

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!