Upcoming EV Cars: 2023లో రానున్న కొత్త ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. అద్భుతమైన మైలేజీ, ధర వివరాలు

Subhash Goud

Subhash Goud |

Updated on: Dec 30, 2022 | 1:06 PM

గత రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు అడుగులు..

Upcoming EV Cars: 2023లో రానున్న కొత్త ఎలక్ట్రిక్‌ కార్లు ఇవే.. అద్భుతమైన మైలేజీ, ధర వివరాలు
Electric Cars

గత రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ వైపు అడుగులు వేశాయి వాహనాల తయారీ కంపెనీలు. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు అందుబాటులోకి రాగా, మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కస్టమర్ డిమాండ్ ఆధారంగా టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్‌తో సహా వివిధ కార్ కంపెనీలు వివిధ విభాగాలలో అనేక ఎలక్ట్రిక్‌ కార్ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త ఈవీ కార్లలో ఈసారి ఫ్లాగ్‌షిప్ ఈవీ కార్లు బడ్జెట్ ధరలో విడుదల కానున్నాయి. మైలేజీ కూడా అద్భుతంగా ఉంటున్నాయి.

  1. మహీంద్రా X UV400 ఎలక్ట్రిక్: మహీంద్రా XUV 400 EV ప్రస్తుతం విడుదల చేయబోయే కొత్త ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మహీంద్రా కంపెనీ ఇప్పటికే కొత్త ఈవీ మోడల్‌ను ఆవిష్కరించింది. జనవరి మధ్యలో కొత్త ఎలక్ట్రిక్‌ కారును ప్రకటించింది. కొత్త ఎలక్ట్రిక్‌లో మహీంద్రా 100 KV ఎలక్ట్రిక్ మోటార్‌తో 39.4 KVH లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను జత చేసింది. దీని ద్వారా కొత్త XUV400 కారు అద్భుతమైన పనితీరుతో ఛార్జ్‌కి గరిష్టంగా 456 కిమీ మైలేజీని ఇస్తుంది.
  2. టాటా పంచ్ ఎలక్ట్రిక్: 2023లో విడుదల కానున్న ముఖ్యమైన కార్లలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఒకటి. కొత్త పంచ్ ఈవీలో టియాగో వంటి రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఎంట్రీ లెవల్ 19.2 KVH మోడల్, టాప్-ఎండ్ 24 KVH బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ద్వారా ఒక్కో ఛార్జ్ కు 280 నుంచి 350 కి.మీ మైలేజీని ఇవ్వగలదు. ఇది టాటా కంపెనీకి భారీ డిమాండ్‌ను తీసుకురానుందని భావిస్తున్నారు.
  3. MG మైక్రో EV: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో అగ్రగామిగా ఉన్న ఎంజీ మోటార్ కంపెనీ త్వరలో మరిన్ని ఈవీ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ZS EV కారు తర్వాత ఈసారి మైక్రో ఈవీ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. వ్యక్తిగత మొబిలిటీ కోసం కొత్త ఈవీ కారు ప్రారంభించనుంది. పట్టణ ట్రాఫిక్‌కు సౌకర్యంగా ఉండేలా కొత్త కారు ఒకసారి ఛార్జ్‌తో 150 కి.మీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
  4. సిట్రాన్ E C3: అత్యంత ఎదురుచూస్తున్న కొత్త ఎలక్ట్రిక్‌ మోడల్‌లలో ఒకటి Citroen E C3. బడ్జెట్ ఈవీ కార్ల జాబితాలో సంచలనం సృష్టించిన కొత్త ఈసీ3 కారు మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానుంది. కొత్త కారు బడ్జెట్ ధరతో ఒక్కో ఛార్జీకి 300 కిమీ మైలేజీని అందిస్తుంది. కొత్త ఈవీ కార్ మోడల్‌ను సిట్రోయెన్ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేస్తుంది. కొత్త కారును భారతదేశం నుండి ప్రధాన అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయాలని యోచిస్తోంది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu