Zomato 2022: ఈ ఏడాదిలో ఇతను జొమాటోలో 3,330 ఆర్డర్లు చేశాడట.. టాప్‌ కస్టమర్‌ ఇతడే.. వార్షిక నివేదిక విడుదల

భోజన ప్రియులకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉంటాయి. అందులో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజుల్లో బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీ అనగానే లొట్టలేసుకునేవాళ్లు..

Zomato 2022: ఈ ఏడాదిలో ఇతను జొమాటోలో 3,330 ఆర్డర్లు చేశాడట.. టాప్‌ కస్టమర్‌ ఇతడే.. వార్షిక నివేదిక విడుదల
Zomato Food
Follow us
Subhash Goud

|

Updated on: Dec 29, 2022 | 9:09 PM

భోజన ప్రియులకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉంటాయి. అందులో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజుల్లో బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. బిర్యానీ అనగానే లొట్టలేసుకునేవాళ్లు ఎంతో మంది. బిర్యానీ పేరు తీయగానే నోట్లో నీళ్లు ఊరటం ఖాయం. మీరు కూడా ఈ వార్తను చదువుతుంటే మీకు కూడా నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఎక్కడ వెళ్లిన బిర్యానీ వాసన త్వరగా వస్తుంటుంది. ఎంతదూరం నుంచైనా ముక్కు వాసనను ఇట్టే పసిగట్టేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ‘బిర్యానీ’ అంటే చాలు ఎగబడి తింటారు. మరింత ఇంతటి రుచికరమైన బిర్యానీకి భారతదేశంలో ఎంత మంది అభిమానులున్నారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

బిర్యానీ ప్రియులు ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్‌ చేసేసుకుంటారు. ఫుడ్‌ ఆర్డర్‌ కోసం రకరకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల స్విగ్గీ నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్‌ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జొమాటో కూడా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. జొమాటో ద్వారా ఎన్ని ఆర్డర్లు వచ్చాయో ఈ నివేదికలో వెల్లడించింది.

ఈ జొమాటోయాప్‌ ద్వారా ఓ వ్యక్తి ఈ ఏడాది(2022)లో అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్‌ కస్టమర్‌గా నిలిచాడని జొమాటో తెలిపింది. ఢిల్లీకి చెందిన అంకుర్‌ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్‌ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్‌ బిగ్గెస్ట్‌ ఫుడీ..’ అంటూ అంకుర్‌ని జొమాటో తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి

డిస్కౌంట్‌ ప్రోమో కోడ్‌లను ఉపయోగించుకుని..

ఇక ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ కస్టమర్ల కోసం రకరకాల ఆఫర్లను అందిస్తుంటాయి. ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఎన్నో డిస్కౌంట్లు అందిస్తుంటుంది. డిస్కౌంట్ ప్రోమో కోడ్‌లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్‌లోని రాయ్‌గంజ్ మొదటి స్థానంలో నిలిచినట్లు జొమాటో తెలిపింది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్‌లతోనే ఈ సంవత్సరం ఆర్డర్ చేశారట. ముంబయికి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్‌ల ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడట. అలాగే జొమాటో యాప్‌లో బిర్యానీ తర్వాత ఎక్కువగా పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు జొమోటో తన నివేదికలో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి