Ola Electric Scooters: 2022లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఎన్ని అంటే..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వాహనదారులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల నుంచి గట్టె్క్కేందుకు ఎలక్ట్రిక్..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వాహనదారులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల నుంచి గట్టె్క్కేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. దీంతో ఈ ఏడాది 2022లో చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మరిన్ని స్కూటర్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఏడాదిలో మొదట ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో విడుదలైంది. దీంతో హట్‌కేకుల్లా అమ్ముడు పోయాయి. కస్టమర్ల తాకిడి ఎక్కువ అయ్యేసరికి స్కూటర్ల కొరత ఏర్పడింది. అయినా కంపెనీ కస్టమర్లకు సర్వీసు అందించేందుకు స్కూటర్ల తయారీలో వేగాన్ని పెంచింది. అయితే ఓలా ఎలక్ట్రిక్ అనేక సమస్యలపై విమర్శలను ఎదుర్కొన్న ఏడాదిలో రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫాం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ విభాగం 2022లో దాదాపు 1.5 లక్షల వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది.
వచ్చే రెండేళ్లలో మార్కెట్లో ప్రీమియం మోటార్‌సైకిల్, స్కూటర్లతో సహా మరిన్ని ఎలక్ట్రిక్ టూవీలర్‌లను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ బుధవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. ఈ సంవత్సరంలో దాదాపు 1,50,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించామని అన్నారు. 2025 చివరి నాటికి భారతదేశంలో విక్రయించబడే అన్ని టూవీలర్ ఎలక్ట్రిక్ అందుబాటులోకి తీసుకువస్తామని, అలాగే 2030 నాటికి భారతదేశంలో విక్రయించబడే అన్ని ఎలక్ట్రిక్ కార్లను తీసుకువస్తామని అన్నారు.
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం Ola S1 ప్రో, Ola S1 అనే రెండు వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకువచ్చామని, అయితే తక్కువ ధర కలిగిన వెర్షన్ Ola S1 ఎయిర్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకువస్తామని అన్నారు. అదనంగా ఓలా 2027 నాటికి ఆరు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో భవిష్ అగర్వాల్ అన్నారు. దాని మొదటి ఫోర్ వీలర్‌ను 2024లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ 2024 వేసవి నాటికి భారతదేశంలో తన మొదటి ఫోర్-వీలర్‌ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది 4 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగంతో దూసుకెళ్లి 500 కి.మీ మైలేజీని అందించే ఈ కారు భారతదేశంలో అత్యంత వేగవంతమైన స్పోర్టియస్ట్ కార్లలో ఒకటిగా ఉంటుందని అగర్వాల్ చెప్పారు. కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో, Ola దాని ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయని, కొంతమంది వినియోగదారులకు గాయాలైనట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఫ్లాక్ వచ్చింది. దాని EVల పరిధి మరియు నాణ్యత సమస్యలపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. 2023, 2024లో టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని మరింతగా పెంచుతామన్నారు. లిథియం-అయాన్ సెల్ తయారీని మెరుగుపర్చే ప్రయత్నంలో భాగంగా 2023 చివరి నాటికి 5GWh సామర్థ్యంతో సెల్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించాలని ఓలా యోచిస్తోందని ఆయన చెప్పారు.
అయితే జూలైలో ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన లిథియం-అయాన్ సెల్‌ను ఆవిష్కరించింది. దేశంలో దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ACC PLI పథకం కింద కంపెనీకి 20 GWh సామర్థ్యాన్ని కేటాయించిందని, ఈ అత్యంత కీలకమైన భాగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 20 GWh వరకు ప్రారంభ సామర్థ్యంతో సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని సీఈవో తెలిపారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి