Current Account Deficit: రికార్డు స్థాయికి కరెంట్‌ ఖాతా లోటు.. డేటాను విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంకు

2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు $ 36.4 బిలియన్లకు పెరిగింది. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. ఈ డేటాను ఆర్‌బీఐ విడుదల చేసింది..

Current Account Deficit: రికార్డు స్థాయికి కరెంట్‌ ఖాతా లోటు.. డేటాను విడుదల చేసిన రిజర్వ్‌ బ్యాంకు
Current Account
Follow us

|

Updated on: Dec 29, 2022 | 7:35 PM

2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు $ 36.4 బిలియన్లకు పెరిగింది. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. ఈ డేటాను ఆర్‌బీఐ విడుదల చేసింది. రెండవ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే రెట్టింపు అయింది. అంటే మొదటి త్రైమాసికంలో $ 18.2 బిలియన్లు, 2021-22 మూడవ త్రైమాసికంతో పోలిస్తే ఇది 4 రెట్లు పెరిగింది. ఈ గణాంకాలను విడుదల చేసిన ఆర్‌బిఐ.. 2022-23 రెండవ త్రైమాసికంలో వాణిజ్య లోటు మొదటి త్రైమాసికంలో 63 బిలియన్ డాలర్ల నుండి 83.5 బిలియన్ డాలర్లకు పెరిగిందని, అందుకే కరెంట్ ఖాతా లోటులో పెరుగుదల ఉందని తెలిపింది. పెట్టుబడి ఆదాయంలో భారీ ఉపసంహరణ కూడా జరిగింది. అందుకే ద్రవ్యలోటు పెరిగింది.

అంతకుముందు 2012-13 మూడవ త్రైమాసికంలో కరెంట్ లోటు 31.77 బిలియన్ డాలర్లు ఉన్నప్పుడు అత్యధిక కరెంట్ ఖాతా లోటు కనిపించింది. 2021-22లో మొత్తం కరెంట్ ఖాతా లోటు 38.77 బిలియన్ డాలర్లు. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కరెంట్ ఖాతా లోటు 54.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2021-22 ప్రథమార్థంలో ఉన్న $3.1 బిలియన్ల కంటే 15 రెట్లు ఎక్కువ. అదే సమయంలో 2022-23 రెండవ త్రైమాసికంలో జీడీపీ కరెంట్ ఖాతా లోటు 4.4 శాతంగా ఉంది. ఇది మొదటి త్రైమాసికంలో 2.2 శాతం, 2021-22 రెండవ త్రైమాసికంలో 1.3 శాతం. అదే సమయంలో 2022-23 మొదటి అర్ధభాగంలో జీడీపీ కరెంట్ ఖాతా లోటు 3.3 శాతంగా ఉంది. ఇది గత సంవత్సరం 0.2 శాతం.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వస్తువుల ధరలు పెరిగిన తర్వాత కరెంట్ ఖాతా లోటులో పెరుగుదల ఉంది. దీని కారణంగా జూలై-సెప్టెంబర్‌లో భారతదేశ దిగుమతి బిల్లు $200 బిలియన్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..