AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newly Married Girls: కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేస్తున్నారో తెలుసా? సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు

టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా..

Newly Married Girls: కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం సెర్చ్‌ చేస్తున్నారో తెలుసా? సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు
Google Search
Subhash Goud
|

Updated on: Dec 29, 2022 | 4:21 PM

Share

టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలోని ఇంటర్నెట్‌లో మునిగి తేలుతున్నారు. ఇక ఏదైనా కావాలంటే గూగుల్‌ తల్లి ఉండనే ఉంది. దేని గురించి తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్‌ను నమ్ముకుని చిటికెలోనే వెతికేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలనా ఏం జరుగుతుందో క్షణాల్లోనే తెలుసుకునే సదుపాయం ఉంది. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు గూగుల్‌ను నమ్ముకుని తమకు కావాల్సిన అంశాలను సెర్చ్‌ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ఇక తాజాగా నిర్వహించిన గూగుల్‌ సెర్చింగ్‌ సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు బయటకు వచ్చాయి. సర్వే వివరాల ప్రకారం.. గూగుల్‌లో రకరకాల విషయాలపై సెర్చ్‌ చేస్తున్నట్లు సర్వే చెబుతోంది. ఇక కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక మానదు. చాలా మంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తన భర్తను ఏ విధంగా ఆకట్టుకోవాలి..? తన భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలి..? అనే విషయాలను వెతుకుతున్నారట. అంతేకాదండోయ్‌.. అత్తగారిని సైతం ఎలా ఆకట్టుకోవాలి.. తన వైపు ఎలా తిప్పుకోవాలి..అనే విషయాలపై గూగుల్‌లో ఎక్కువ సెర్చ్‌ చేస్తున్నట్లు సర్వేలో తేలింది.

ఇంకో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభార్తలు కలవాలి.. అనే విషయాన్ని కూడా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారట. ఇలా ఈ ఏడాది కొత్తగా పెళ్ళైన మహిళలు రకరకాలు విషయాలపై గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇతరుల నుంచి, పెద్దల నుంచి తెలుసుకోవాల్సి ఉండేది. కానీ రానురాను టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా గూగుల్‌ తల్లిని నమ్ముకోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి