AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: వచ్చే బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌..? ఆ పరిమితిని పెంచనున్నారా?

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తు మొదలైంది. బడ్జెట్‌ ఏ వర్గాల వారికి..

Budget 2023: వచ్చే బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌..? ఆ పరిమితిని పెంచనున్నారా?
Budget 2023
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 03, 2023 | 2:28 PM

Share

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇప్పటికే బడ్జెట్‌పై కసరత్తు మొదలైంది. బడ్జెట్‌ ఏ వర్గాల వారికి ఎలాంటి ఉపశమనం ఉంటుందో అని ఎంతో మంది అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు వర్గాల వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్నుపై కూడా బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని చాలా కాలంగా కోరుతున్నారు. ప్రస్తుతం మదింపుదారులకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే. ఆరు నెలకు రూ. 2.5 లక్షల వరకు సంపాదించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 87ఏ కింద రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారు మాత్రం పన్ను పరిధిలోకి వస్తారు. అయితే 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్న వారికి 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దానిని పూర్తిగా తొలగించి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

అయితే వచ్చే 2023 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో పెరుగుదల ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుందని అసోచామ్‌ అధ్యక్షుడు సుమంత్‌ సిన్హా డిసెంబర్‌ 15న మీడియా సమావేశంలో తెలిపారు.

జీఎస్టీ ఉపశమనం :

అలాగే అసోచామ్ ప్రభుత్వానికి మరొక సూచనా కూడా చేసింది. జీఎస్టీని ఆలస్యంగా చెల్లించినందుకు విధించే వడ్డీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని కూడా సూచించింది. 18 శాతం జరిమానా అనేది చాలా ఎక్కువ అని.. ఇది ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే దేశ ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూలంగా కనిపిస్తుందని అన్నారు. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను విధించబడని గరిష్ట ఆదాయ స్లాబ్ రూ. 2.5 లక్షలు. 60-80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇది రూ.5 లక్షలు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి