AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: గూగుల్‌పై రూ.1,337 కోట్ల పెనాల్టీ.. కాలపరిమితి ముగియడంతో సీసీఐ చర్యలకు సిద్ధం

భారతదేశంలో గూగుల్‌కు సమస్య నిరంతరం పెరుగుతోంది. దేశంలో గూగుల్ చేస్తున్న అనైతిక వ్యాపార కార్యకలాపాల కారణంగా వ్యాపార పర్యవేక్షణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్..

Google: గూగుల్‌పై రూ.1,337 కోట్ల పెనాల్టీ.. కాలపరిమితి ముగియడంతో సీసీఐ చర్యలకు సిద్ధం
Google
Subhash Goud
|

Updated on: Dec 29, 2022 | 2:28 PM

Share

భారతదేశంలో గూగుల్‌కు సమస్య నిరంతరం పెరుగుతోంది. దేశంలో గూగుల్ చేస్తున్న అనైతిక వ్యాపార కార్యకలాపాల కారణంగా వ్యాపార పర్యవేక్షణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్‌పై రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. అయితే దిగ్గజం టెక్ కంపెనీ గూగుల్ ఈ జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో అప్పీల్ దాఖలు చేయలేదు. సీసీఐ ద్వారా జరిమానా విధించిన తర్వాత 60 రోజులలోపు ఎన్‌సీఎల్‌ఏటీలో తమ అప్పీల్‌ను దాఖలు చేసే హక్కు కంపెనీలకు ఉంది. కానీ గూగుల్‌e అలా చేయలేదు. అక్టోబర్ 25న అనైతిక వ్యాపారం చేస్తున్నందుకు గూగుల్‌పై జరిమానా విధించాలని సీసీఐ నిర్ణయించిందిన. దీనిని డిసెంబర్ 25 వరకు ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్‌కు అవకాశం ఉండేది.

ఈ కేసులో రూ.1,337 కోట్ల పెనాల్టీ కోసం గూగుల్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. దీంతో పాటు పెనాల్టీ డబ్బులు కూడా జమ చేయలేదు. అటువంటి పరిస్థితిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్వరలో గూగుల్‌పై చర్యను ప్రారంభించి, రూ. 1,337 కోట్ల రికవరీ కోసం డిమాండ్ లేఖను పంపనుంది.

దీని తర్వాత గూగుల్‌పై మరో రూ.937 కోట్ల జరిమానా విధించారు. ఇప్పుడు ఈ విషయంలో సీసీఐ ముందుగా గూగుల్‌కి డిమాండ్ లేఖను పంపనుంది. దీని తర్వాత కంపెనీ జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ అలా చేయని పక్షంలో కంపెనీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత వారం సమాచారం ఇస్తూ సీసీఐ విధించిన పెనాల్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము అప్పీల్ చేయబోతున్నామని గూగుల్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై