LIC Scheme: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రోజూ రూ.200 ఇన్వెస్ట్‌మెంట్‌తో 28 లక్షల బెనిఫిట్‌

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల అద్భుతమైన బీమా పాలసీలను అందజేస్తూనే ఉంది. ఎల్‌ఐసీలో పెట్టుబడి..

LIC Scheme: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రోజూ రూ.200 ఇన్వెస్ట్‌మెంట్‌తో 28 లక్షల బెనిఫిట్‌
Lic Scheme
Follow us

|

Updated on: Dec 28, 2022 | 9:45 PM

దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు వివిధ రకాల అద్భుతమైన బీమా పాలసీలను అందజేస్తూనే ఉంది. ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. అయితే ఎల్‌ఐసీలోని ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఎల్‌ఐసీ సమాజంలోని ప్రతి వర్గాల ప్రజల కోసం బీమా పథకాన్ని తీసుకువస్తుంది. మీరు కూడా పెట్టుబడి గురించి ప్లాన్ చేస్తుంటే ఈ స్కీమ్‌లో చేరడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

మీరు ఎల్‌ఐసీకి చెందిన జీవన్ ప్రగతి ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే దానిలో మీకు జీవితకాల రక్షణ లభిస్తుంది. రోజుకు 200 రూపాయలు, నెలలో 6 వేల రూపాయలు డిపాజిట్ చేయండి. అంటే ఏటా 72 వేల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు బోనస్‌తో పాటు రూ. 28 లక్షలు పొందుతారు. ఈ బీమా ప్లాన్‌లో రిస్క్ కవర్ ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు హామీ మొత్తం పెరుగుతుంది. ఏదైనా కారణంగా పాలసీదారు మరణించినట్లయితే అతని కుటుంబానికి లేదా నామినీకి బోనస్ హామీ మొత్తాన్ని అందించడం జరుగుతుంది.

ఎంత కవరేజీ..

ఈ పథకంలో ఎవరైనా రూ.4 లక్షల బీమా పాలసీని కొనుగోలు చేసినట్లయితే, 5 సంవత్సరాల తర్వాత అది రూ.5 లక్షలు అవుతుంది. దీని తర్వాత 10 నుంచి 15 ఏళ్లకు రూ.6 లక్షలు, 20 ఏళ్లలో ఈ మొత్తం రూ.7 లక్షలు అవుతుంది.

ఇవి కూడా చదవండి

☛ ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి బీమా యోజన కింద మీరు కనీసం 12, 20 సంవత్సరాల కాలపరిమితిని పొందుతారు.

☛ 12 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ బీమా పథకాన్ని తీసుకోవచ్చు.

☛ ఈ పథకం కింద ప్రీమియం మొత్తాన్ని త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు.

☛ కనిష్ట హామీ మొత్తం 1.5 లక్షలు. గరిష్టంపై పరిమితి లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..