5G Fraud: 5జీ పేరుతో యూజర్లకు భారీ షాక్.. అలర్ట్‌గా లేకుంటే బ్యాంక్ ఖాతాల్లో డబ్బంతా ఖాళీ..
5G Upgrade: 5G కోసం ఎదురు చూస్తున్నారా? అయితే, భారీ ప్రమాదంలో పడ్డట్లే. ప్రజల ఈ నిరీక్షణను స్కామర్లు సద్వినియోగం చేసుకుని, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
5G Fraud: భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. జియో, ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన నగరాల్లో తమ సేవలను అందిస్తున్నాయి. ఈ సర్వీస్ ప్రొవైడర్లు క్రమంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. 5G ప్రారంభంతో, స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ప్రజలను ట్రాప్ చేసేందుకు స్కామర్లు 5జీని ఆశ్రయిస్తున్నారు.
జియో (Jio), ఎయిర్ టెల్ ( Airtel) 5G సేవను ప్రారంభించాయి. అయితే Vi, BSNL వినియోగదారులు 5G కోసం మరి కొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. 5G గురించి ప్రజల్లో చాలా ఉత్సాహం ఉన్నందున, స్కామర్లు అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో బిజీగా ఉన్నారు.
5జీ పేరుతో మోసం..
సైబర్ నేరగాళ్లు 5G నెట్‌వర్క్ పేరుతో ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా యూజర్లు స్కామర్ల టార్గెట్‌లో ఉన్నారు. కారణం, ఈ టెలికాం తన 5G సేవను ఇంకా ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మోసగాళ్లు సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు.
స్కామర్లు వీఐ వినియోగదారులకు ఫిషింగ్ సందేశాలను పంపుతున్నారు. ఈ సందేశంలో ఫిషింగ్ లింక్ ఉంటుంది. స్కామర్‌లు మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేయమని వినియోగదారులను అడుగుతున్నారు. మోసగాళ్ల సందేశంలో, Vi 5G నెట్‌వర్క్ పొందేందుకు దిగువ లింక్‌పై క్లిక్ చేయండి లేదా అప్‌గ్రేడ్ కోసం కాల్ చేయండి అంటూ మెసేజ్‌లను పంపిస్తున్నారు. అలా ఇచ్చిన లింక్ Paytm ఖాతాకు సంబంధించినది. ఇక్కడి నుంచే స్కామర్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
సిమ్ అప్‌గ్రేడ్ పేరుతోనూ మోసం..
ఇలాంటి మెసేజ్‌లపై క్లిక్ చేయడం ద్వారా స్కామర్ల ఉచ్చులో చిక్కుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు మాత్రమే ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని అనుకంటే పొరబడినట్లే.
5G సిమ్ అప్‌గ్రేడ్ పేరుతో జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులను ట్రాప్ చేయడానికి స్కామర్లు ప్రయత్నిస్తున్నారు. 5G కోసం మీకు కొత్త SIM కార్డ్ అవసరం లేదని కంపెనీలు ఇప్పటికే క్లియర్ చేశాయి.
మీరు ఇప్పటికే ఉన్న మీ SIM కార్డ్‌లో 5G సేవను ఉపయోగించగలరు. అదే సమయంలో, Vodafone Idea ఇంకా 5G లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..