Year Ender 2022: ఆరంభంలో అదరగొట్టినా.. కీలక మ్యాచ్‌ల్లో ఘోర పరాభవం.. 2022లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?

ఈ సంవత్సరం భారత జట్టు చాలా కీలక సందర్భాలలో విఫలమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2022లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం..

Year Ender 2022: ఆరంభంలో అదరగొట్టినా.. కీలక మ్యాచ్‌ల్లో ఘోర పరాభవం.. 2022లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 26, 2022 | 7:15 AM

ఈ సంవత్సరం భారత జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. అంటే ఒకవైపు జట్టు ఎన్నో సిరీస్‌లను గెలుచుకుంది. మరోవైపు పెద్ద టోర్నీలలో ఓటమిని చవిచూసింది. మూడు ఫార్మాట్లలోనూ మిశ్రమ ఫలితాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు కోల్పోయింది. ఈ సంవత్సరం మూడు ఫార్మాట్లలో ముఖ్యమైన సందర్భాలలో జట్టు ఎలాంటి ప్రదర్శనలను ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

టెస్ట్ క్రికెట్..

2021-22లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. కానీ, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో పాటు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు నాలుగింటిలో విజయం సాధించింది.

వన్డే క్రికెట్..

అయితే ఈ ఏడాది భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్ 2-1 తేడాతో భారత జట్టును ఓడించింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఫలితం మాత్రమే వెల్లడైంది. ఇందులో న్యూజిలాండ్ గెలిచింది. ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

టీ20 ఇంటర్నేషనల్..

ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు రెండు కీలక సందర్భాల్లో ఓటమిని చవిచూసింది. ఆసియా కప్ 2022 సూపర్-4 నుంచి జట్టు మొదట నిష్క్రమించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మొత్తం 40 మ్యాచ్‌లు ఆడి 28 మ్యాచ్‌ల్లో గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..