Year Ender 2022: సీనియర్లు అట్టర్ ఫ్లాప్.. యువకులే సూపర్ హిట్.. 3 ఫార్మట్లలో భారత్‌ను గెలిపించిన ప్లేయర్లు వీరే..

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా విజయంతో 2022 సంవత్సరాన్ని ముగించింది. కాగా, టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రాహుల్ ప్రదర్శన ఈ ఏడాది అంతగా లేదు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, పంత్ వంటి ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు.

Year Ender 2022: సీనియర్లు అట్టర్ ఫ్లాప్.. యువకులే సూపర్ హిట్.. 3 ఫార్మట్లలో భారత్‌ను గెలిపించిన ప్లేయర్లు వీరే..
Rohit Sharma Virat Kohli Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Dec 26, 2022 | 8:57 AM

భారత జట్టు 2022 సంవత్సరాన్ని విజయంతో ముగించింది. మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక భారత జట్టు 2023 సంవత్సరంలో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే 2022 సంవత్సరంలో టీమిండియాకు మిశ్రమంగా నిలిచింది. భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ICC ట్రోఫీ కోసం భారత జట్టు నిరీక్షణ అలాగే నిలిచింది.

భారత వెటరన్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రెండు సెంచరీలు సాధించి ఈ ఏడాది తన కరువు తీర్చుకున్నాడు. అయితే 2022లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతనే కాకపోవడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది మరిచిపోలేని సంవత్సరం. అతను ఆసియా కప్‌లో లేదా టీ20 ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ ఏడాది టెస్టులు, వన్డేలు, టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది ఎవరో ఇఫ్పుడు తెలుసుకుందాం..

టెస్టులో పంత్ ఫైర్..

టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడితే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రిషబ్ పంత్ 7 మ్యాచ్‌ల్లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్ బ్యాట్ నుంచి రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. విరాట్ కోహ్లీ టాప్-5లో నిలవలేదు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అతని పేరు మీద కేవలం 265 పరుగులు మాత్రమే నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు (2022):

1. రిషబ్ పంత్ – 7 మ్యాచ్‌లు, 680 పరుగులు

2. శ్రేయాస్ అయ్యర్ – 5 మ్యాచ్‌లు, 422 పరుగులు

3. ఛెతేశ్వర్ పుజారా – 5 మ్యాచ్‌లు, 409 పరుగులు

4. రవీంద్ర జడేజా – 3 మ్యాచ్‌లు, 328 పరుగులు

5. రవిచంద్రన్ అశ్విన్ – 6 మ్యాచ్‌లు, 270 పరుగులు

వన్డేల్లో శ్రేయస్ దూకుడు..

వన్డే క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీదున్నాడు. ఈ ఏడాది 17 వన్డేల్లో 55.69 సగటుతో శ్రేయస్ ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలతో సహా 724 పరుగులు చేశాడు. వన్డేల్లో టాప్-5 భారత బ్యాట్స్‌మెన్‌లలో కూడా కోహ్లీకి చోటు దక్కలేదు. ఈ ఏడాది వన్డేల్లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 302 పరుగులు చేశాడు.

వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు (2022):

1. శ్రేయాస్ అయ్యర్ – 17 మ్యాచ్‌లు, 724 పరుగులు

2. శిఖర్ ధావన్ – 22 మ్యాచ్‌లు, 688 పరుగులు

3. శుభ్‌మన్ గిల్ – 12 మ్యాచ్‌లు, 638 పరుగులు

4. ఇషాన్ కిషన్ – 8 మ్యాచ్‌లు, 417 పరుగులు

5. రిషబ్ పంత్ – 12 మ్యాచ్‌లు, 336 పరుగులు

ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. సూర్య 31 మ్యాచ్‌లలో 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 20 మ్యాచ్‌ల్లో 781 పరుగులతో ఈ భారత జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

టీ20లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్లు (2022):

1. సూర్యకుమార్ యాదవ్ – 31 మ్యాచ్‌లు, 1164 పరుగులు

2. విరాట్ కోహ్లీ – 20 మ్యాచ్‌లు, 781 పరుగులు

3. రోహిత్ శర్మ – 29 మ్యాచ్‌లు, 656 పరుగులు

4. హార్దిక్ పాండ్యా – 27 మ్యాచ్‌లు, 607 పరుగులు

5. ఇషాన్ కిషన్ – 16 మ్యాచ్‌లు, 476 పరుగులు

శ్రేయాస్ అయ్యర్ లిస్టులో టాప్..

ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లను కలిపితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 40 ఇన్నింగ్స్‌ల్లో 48.75 సగటుతో మొత్తం 1609 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచారు.

2022 సంవత్సరంలో భారత్ తరపున అత్యధిక పరుగులు (మూడు ఫార్మాట్లతో సహా)

1. శ్రేయాస్ అయ్యర్ – 1609 పరుగులు

2. సూర్యకుమార్ యాదవ్ – 1424 పరుగులు

3. రిషబ్ పంత్ – 1380 పరుగులు

4. విరాట్ కోహ్లీ – 1348 పరుగులు

5. రోహిత్ శర్మ – 995

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..