- Telugu News Photo Gallery Cricket photos Matthew Wade Birthday: Cancer colour blindness hero of Australia T20 World Cup
క్యాన్సర్‌ను ఓడించాడు.. కలర్ బ్లైండ్‌నెస్‌ను అధిగమించాడు.. హ్యాట్రిక్ సిక్సర్లతో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు
మాథ్యూ వేడ్.. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్‌గానే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ అతని జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 26) వేడ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని పర్సనల్ లైఫ్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం..
Updated on: Dec 26, 2022 | 7:53 AM

మాథ్యూ వేడ్.. ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్‌గానే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ అతని జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 26) వేడ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని పర్సనల్ లైఫ్‌లోని ఆసక్తికర విషయాలు మీకోసం..

గ్బీ క్రీడాకారుల కుటుంబంలో పుట్టిన ఈ స్టార్ ఎన్నో బలహీనతలను ఎలా అధిగమించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. వేడ్ తండ్రి ఆస్ట్రేలియాలోనే ప్రముఖ రగ్బీ ఆటగాడు. అతని తాత కూడా రగ్బీ క్లబ్‌కు అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఆఖరుకు అతని సోదరులు, బంధువులు కూడా రగ్బీ ఆడేవారు. కానీ ఆశ్చర్యకరంగా క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాడు వేడ్.

చిన్న వయసులోనే టెస్టిక్యులర్ క్యాన్సర్ బారిన పడ్డాడీ స్టార్ ప్లేయర్. కీమోథెరపీ చికిత్స కూడా తీసుకోవాల్సి వచ్చింది. మనో ధైర్యంతో మహమ్మారిన జయించిన మాథ్యూ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. చివరకు 2011లో ఆస్ట్రేలియా జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం పొందాడు.

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు వేడ్. ముఖ్యంగా పాకిస్తాన్‌తో ఎంతో ఉత్కంఠగా జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండిపోతుంది. స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదీ ఓవర్‌లో చివరి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా వేడ్ ఆస్ట్రేలియా జట్టును వరల్డ్ కప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

పొట్టి ఫార్మాట్‌లోఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో వేడ్ కీలక పాత్ర పోషించాడు. 12 ఏళ్ల కెరీర్‌లో 4498 పరుగులు చేశాడీ స్టార్ ప్లేయర్. కాగా అతను ఇప్పుడు కూడా వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) ఉంది. ఈ కారణంగా, పగలు, రాత్రి వేర్వేరు రంగులను గుర్తించడంలో అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.





























