Gold Price Today: చుక్కలు చూపిస్తోన్న బంగారం ధర.. తులం గోల్డ్ రేట్ ఎంతకు చేరిందో తెలుసా.?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. గడిచిన మూడు రోజులుగా బంగారం ధర రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 23వ తేదీన భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌ ఆ తర్వాత పెరుగుతూ పోతోంది. తాజాగా గురువారం కూడా బంగారం ధరలో పెరుగుదల..

Gold Price Today: చుక్కలు చూపిస్తోన్న బంగారం ధర.. తులం గోల్డ్ రేట్ ఎంతకు చేరిందో తెలుసా.?
Today Gold Price
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2022 | 6:41 AM

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదన్నట్లు దూసుకుపోతోంది. గడిచిన మూడు రోజులుగా బంగారం ధర రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్‌ 23వ తేదీన భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్‌ ఆ తర్వాత పెరుగుతూ పోతోంది. తాజాగా గురువారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా రూ. 200 పెరుగుదల కనిపించింది. గురువారం దేశ వ్యాప్తంగా బంగారం, ధర ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,860 వద్దకొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. , 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. వద్దగా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 51,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,690 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 50,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,760 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 50,150 గా ఉండగా, 24 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 54,710 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 54,710 గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 50,150 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ ధర రూ. 54,710 గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గురువారం దేశవ్యాప్తంతా దాదాపు అన్ని నగరాల్లో వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. కేజీ సిల్వర్‌పై సుమారు రూ. 400 పెరిగింది. మరి ఈరోజు పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,300 కాగా, ముంబైయిలో రూ. 72,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..