Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగానే ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్ల వివరాలివే

పసిడి ప్రియులకు కాస్త ఊరట. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ (డిసెంబర్‌ 28) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,950కు లభిస్తోంది.

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగానే ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్ల వివరాలివే
Today Gold Price
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2022 | 6:43 AM

పసిడి ప్రియులకు కాస్త ఊరట. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ (డిసెంబర్‌ 28) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,950కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480గా ఉంది. ఇదిలా ఉంటే బుధవారం వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ.1000కి పైగా పెరగడం గమనార్హం. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 72,300 పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480 పలుకుతోంది.
  • విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 కులభిస్తోంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,510 ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,520 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,630 ఉంది
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 పలుకుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,480 గా ఉంది.

వెండి ధరలిలా.

ఇక మారిన దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి రేట్లు ఇలా ఉన్నాయి. చైన్నైలో కిలో వెండి ధర రూ.74,200, ముంబైలో రూ.72,300, ఢిల్లీలో రూ.72,300, హైదరాబాద్‌లో రూ.74,200, కోల్‌కతాలో రూ.72,300, బెంగళూరులో రూ.74,200, విజయవాడలో రూ.74,000 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే