Optical Illusion: మీ కంటి సామర్థ్యానికి అసలైన పరీక్ష.. పుస్తకాల మధ్యలో ఒక అగ్గిపుల్ల.. 15 సెకన్లలో కనిపెడితే తోపే

టో పజిల్స్‌, బ్రెయిన్‌ టీజర్‌ అంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇవి చూడడానికి మామూలు ఫొటోల్లానే ఉన్నప్పటికీ కంటికి కనిపించని మరొక మర్మం అందులో దాగుంటుంది.

Optical Illusion: మీ కంటి సామర్థ్యానికి అసలైన పరీక్ష.. పుస్తకాల మధ్యలో ఒక అగ్గిపుల్ల.. 15 సెకన్లలో కనిపెడితే తోపే
Optical Illusion
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2022 | 12:23 PM

ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌గా మారింది. ఫొటో పజిల్స్‌, బ్రెయిన్‌ టీజర్‌ అంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఇవి చూడడానికి మామూలు ఫొటోల్లానే ఉన్నప్పటికీ కంటికి కనిపించని మరొక మర్మం అందులో దాగుంటుంది. అది కనుక్కోవడమే ఈ ఫొటోల్లో ఉన్న అసలు ట్విస్ట్‌. దీనివల్ల కంటి చూపు, ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. ఇక విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయి. అలాగే పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అందుకే చాలామంది ఈ ఫజిల్స్‌ను సాల్వ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. పై ఫొటో కూడా అలాంటిదే. ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇందులో చూడ్డానికి చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే వాటి మధ్యలోనే ఎవరికీ కనిపించకుండా ఒక అగ్గిపుల్ల దాచిపెట్టాడు ఫొటో డిజైనర్‌. దీనిని 15 సెకన్లలోపు కనుక్కుంటే మీ కళ్లు డేగ కళ్లలా పదునుగా ఉన్నట్లే.

ఈ వైరల్‌ ఫొటోలో ఒకదానిపై ఒకటి పుస్తకాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 2-3 పుస్తకాలు, కొన్ని చోట్ల 3-4 పుస్తకాలు ఒకదానిపై ఒకటి ఉంచారు. కొన్ని పుస్తకాల ముఖ చిత్రం ఎరుపు రంగులోను, మరికొన్ని పుస్తకాల ముఖచిత్రం పసుపు రంగులోను ఉండగా, ఇంకొన్ని పుస్తకాల కవర్లు ఆకుపచ్చ, నీలం రంగులో ఉంటాయి. ఈ విభిన్న రంగుల పుస్తకాలలో దేనిలోనైనా, ఆ అగ్గిపుల్ల దాగి ఉంది. అయితే అది సులభంగా మాత్రం కనిపించదు. కొంచెం శ్రద్ధగా, ఓపికగా చూస్తే మాత్రం ఇట్టే ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయవచ్చు. ఏంటీ కనిపెట్టలేకపోయారా? అయతే ఒక చిన్న క్లూ ఇస్తున్నాం ట్రై.. అగ్గిపుల్ల ఉన్న పుస్తకం కవర్ నీలం రంగులో ఉంటుంది. అలాగే దానిపై రెడ్‌ కవర్‌ పుస్తకం ఉంటుంది. ఏంటీ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారా. మరేం పర్వాలేదు. ఆన్సర్ కూడా మేమే ఇచ్చేస్తున్నాం. మీరే చూడండి.

ఇవి కూడా చదవండి

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..