Nikhat Zareen: మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. నేషనల్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరో అద్భుత విజయం విజయం సాధించింది. మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ స్వర్ణం సాధించింది. సోమవారం ఉదయం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అనామికపై 4-1 తేడాతో జరీన్‌ విజయం సాధించింది

Nikhat Zareen: మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. నేషనల్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిఖత్
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2022 | 1:42 PM

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరో అద్భుత విజయం విజయం సాధించింది. మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ స్వర్ణం సాధించింది. సోమవారం ఉదయం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో రైల్వేస్ కు చెందిన అనామికపై 4-1 తేడాతో జరీన్‌ విజయం సాధించింది.  50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా బాక్సింగ్‌ చేసింది. దీంతో అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బౌట్‌ను గెలిచినప్పటికీ అనామికకు నిఖత్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. దీంతో ప్రతిష్ఠాత్మక టోర్నీలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.

కాగా ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణింయింది నిఖత్ జరీన్.  50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆమె సెమీస్ లో  ఏఐపీకు చెందిన శివిందర్ కౌర్ పై 5-0 తేడాతో  విజయం సాధించింది.  తద్వారా టైటిల్ పోరుకు చేరుకుంది.  50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే దూకుడుగా బాక్సింగ్‌ చేసింది. దీంతో అనామిక ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బౌట్‌ను గెలిచినప్పటికీ అనామికకు నిఖత్‌ చేతిలో ఓటమి తప్పలేదు. ఐదు రౌండ్లలో కేవలం చివరిదాంట్లో మాత్రమే జరీన్ కంటే అనామిక ఎక్కువ పాయింట్లను దక్కించుకోగలిగింది. కామన్వెల్త్ గేమ్స్ 2022, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నిఖత్‌ టైటిళ్లను గెలుచుకొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి