Funny Video: నెత్తిన దరిద్రమంటే ఇదేనేమో.. ఎవరూ ఊహించని రీతిలో రనౌటైన బ్యాటర్.. వీడియో చూస్తే నవ్వాగదంతే
బ్యాటర్ల అలసత్వమో లేదా అదృష్టం కలిసిరాకో చాలామంది ఊహించని రీతిలో ఔటవుతుంటారు. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్ టోర్నీలో కూడా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్ అనుకోని రీతిలో ఔటయ్యాడు.
క్రికెట్ మ్యాచ్‌లో అప్పుడప్పుడూ కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా రనౌట్ల విషయంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. బ్యాటర్ల అలసత్వమో లేదా అదృష్టం కలిసిరాకో చాలామంది ఊహించని రీతిలో ఔటవుతుంటారు. తాజాగా యూరోపియన్ క్రికెట్ లీగ్ టోర్నీలో కూడా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్ అనుకోని రీతిలో ఔటయ్యాడు. ఫ్యాన్‌కోడ్ ఈసీఎస్ మాల్టా గేమ్‌లో భాగంగా ఓవర్సీస్ క్రికెట్, స్వీకీ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఓవర్సీస్ బ్యాటర్ హెన్రిచ్ గెరిక్ బౌన్స్ అయిన బంతిని ఆఫ్‌సైడ్ దిశగా ఆడాడు. అయితే బౌలర్ బంతిని అందుకునే ప్రయత్నంలో అంచనాలు తప్పిపోయాయి. దీంతో బంతి అతని తలపై బౌన్స్ అయ్యి దిశను మార్చుకుంది. ఇంతలో బ్యాటర్ పరుగు తీయడానికి ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ నేరుగా వికెట్లవైపు విసిరాడు. అంతే 20 బంతుల్లో 44 పరుగులతో దాటిగా ఆడుతున్న గ్రీక్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
‘దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇక్కడ దరిద్రం బౌలర్ నెత్తి రూపంలో ఉంది. అది బ్యాటర్‌కు శాపంగా మారిందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఓవర్సీస్ క్రికెట్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 104 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన స్వికీ యునైటెడ్ నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Sometimes you gotta use your head to get a wicket?? #EuropeanCricket #EuropeanCricketSeries #CricketinMalta pic.twitter.com/fpqDXrsVY1
— European Cricket (@EuropeanCricket) December 24, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..