Year Ender 2022: నిమిషానికి ఏకంగా 137 ఆర్డర్లు.. ఈ ఏడాది ఎక్కువ మంది లొట్టలేసుకుని తినింది ఈ వంటకాన్నే

గత కొన్నేళ్లుగా స్విగ్గీ, జొమాటోలకు డిమాండ్ బాగా పెరిగింది. ఆహార ప్రియులకు కావాల్సిన వాటిని క్షణాల్లోనే అందిస్తున్న ఈ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి

Year Ender 2022: నిమిషానికి ఏకంగా 137 ఆర్డర్లు.. ఈ ఏడాది ఎక్కువ మంది లొట్టలేసుకుని తినింది ఈ వంటకాన్నే
Swiggy Food Delivery
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2022 | 1:43 PM

గత కొన్నేళ్లుగా స్విగ్గీ, జొమాటోలకు డిమాండ్ బాగా పెరిగింది. ఆహార ప్రియులకు కావాల్సిన వాటిని క్షణాల్లోనే అందిస్తున్న ఈ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. కాగా మరికొన్ని రోజుల్లో 2022 ముగియనుంది. ఈ సందర్భంగా ఎప్పటిలాగే ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ 2022కు సంబంధించి తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కాగా ఈ ఏడాది ఎక్కువగా కస్టమర్లు దేని కోసం ఆర్డర్‌ ఇచ్చారో తెలుసా? బిరియానీ.. సందర్భమేదైనా లొట్టలేసుకుని తినే ఈ రుచికరమైన వంటకోసం స్విగ్గీ కంపెనీకి ప్రతి నిమిషానికి 137 ఆర్డర్‌లు వచ్చాయట. మొత్తంమీద ఈ ఏడాది బిర్యానీ ఆర్డర్ల ద్వారా కంపెనీకి దాదాపు రూ. 53 కోట్లు ఆదాయం వచ్చిందట. కాగా గత సంవత్సరం విడుదలైన నివేదికలో కూడా బిర్యానీకే అగ్రతాంబూలం దక్కింది. 2021లో బిర్యానీ కోసం స్విగ్గీ సంస్థకు ప్రతి నిమిషానికి 115 ఆర్డర్‌లు వచ్చాయి. కాగా బిర్యానీ తర్వాతి ప్లేస్‌ లో మసాలా దోస కోసం ఎక్కువమంది ఆర్డర్‌ చేశారట. ఆతర్వాత కొరియన్ నూడుల్స్, సుషీ, మెక్సికన్ ఫుడ్స్‌కు డిమాండ్‌ బాగా పెరిగిందట.

కాగా ఈ సంవత్సరం టీ ఆర్డర్‌లో సుమారు 305 శాతం పెరుగుదల ఉందట. అలాగే కాఫీని ఆర్డర్ చేసే కస్టమర్ల సంఖ్య దాదాపు 267 శాతం పెరిగింది. అలాగే ఉల్లిపాయలు, టమోటాలు, అరటిపండు మరియు ఇతర వస్తువులను బాగానే ఆర్డర్ చేశారట. ఇక హైదరాబాద్‌కు సంబంధించిన ఆర్డర్లలో కూడా బిర్యానీకే టాప్‌ ప్లేస్‌ దక్కింది. అత్యధికంగా ఆర్డర్‌ చేసిన మొదటి మూడు వంటకాల్లో చికెన్‌ బిర్యానీ, అప్రికాట్‌ డిలైట్‌, మటన్‌ బిర్యానీ నిలిచాయి. స్నాక్‌ డిషెస్‌లో ఇడ్లీ, మస్కాబన్‌, మసాలా దోశను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. డెజర్ట్‌లలో అప్రికాట్‌ డిలైట్‌, డబుల్‌ కా మిఠా, ఫ్రూట్‌ సలాడ్‌ విత్‌ ఐస్‌క్రీమ్‌, అంతే కాకుండా కూల్ డ్రింక్స్, పాల ఉత్పత్తులు కూడా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.