Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: కరోనా నుంచి రక్షణ, రోగనిరోధక శక్తినిచ్చే ఉసిరితో రుచికరమైన ఆమ్లా సాస్, ఉసిరి లడ్డూ తయారీ రెసిపీ మీకోసం

ఆయుర్వేదంలో ఉసిరికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం పేర్కొంది. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించే వారు ఉసిరిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Corona: కరోనా నుంచి రక్షణ, రోగనిరోధక శక్తినిచ్చే ఉసిరితో రుచికరమైన ఆమ్లా సాస్, ఉసిరి లడ్డూ తయారీ రెసిపీ మీకోసం
Amla Recipes
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2022 | 4:10 PM

మళ్ళీ ప్రపంచం మొత్తం కరోనా ఫోర్త్ వేవ్ భయంతో నిండివుంది. కరోనా కొత్త సబ్-వేరియంట్ Omicron BF.7 కేసులు ఓ వైపు చైనా, అమెరికా సహా అనేక దేశాల్లో వేగంగా పెరుగుతున్నాయి. మన దేశం మాత్రమే కాదు.. దాదాపు ప్రపంచ దేశాలన్నీ మొత్తం దాదాపు 3 సంవత్సరాలుగా కోవిడ్ -19 మహమ్మారిని  ఎదుర్కొంటోంది. అటువంటి పరిస్థితిలో.. ఈ కొత్త వేరియంట్ ప్రజల ఆందోళనను పెంచుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఔషధాలతో పాటు, దేశీయ ఆహారాన్ని కూడా తీసుకోవాల్సి ఉంది. మనం తినే ఆహారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కొత్త వేరియంట్  నుండి రక్షణ లభిస్తుంది.  సూపర్ ఫుడ్ గా ఉసిరిలో అనేక వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే గుణాలున్నాయి. ఆయుర్వేదంలో ఉసిరికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం పేర్కొంది. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నించే వారు ఉసిరిని ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమ్లాతో టేస్టీ టేస్టీ వంటకాల తయారీ గురించి తెలుసుకుందాం..

ఉసిరి లడ్డూలు కావలసినవి: ఉసిరి – 20 లేదా 500 గ్రాములు (తురిమిన), ఖర్జూరం – 10 , నువ్వులు – 1 టీస్పూన్, అవిసె గింజలు – 1 టీస్పూన్ పొడి , యాలకుల పొడి – 1/4 టీస్పూన్

తయారీ విధానం: ముందుగా ఉసిరికాయను కడిగి ఆరబెట్టండి. ఇప్పుడు  ఉసిరిని తురుముకుని ఆరబెట్టాలి. ఇప్పుడు అందులో ఖర్జూరం పేస్ట్, యాలకుల పొడి, అవిసె గింజలపొడి, నువ్వులు వేసి లడ్డూ ఆకారంలో చుట్టుకొంది.  ఇవ్వండి. ఈ ఉసిరి లడ్డూలు శరీరంలోని విటమిన్ సి , ఐరన్ లోపాన్ని తొలగిస్తాయి. పిల్లలకు అత్యంత మేలు చేస్తాయి ఈ ఉసిరి లడ్డులు..

ఇవి కూడా చదవండి

ఆమ్లా సాస్ కావలసినవి: ఉసిరికాయ గుజ్జు (ఒక కప్పు), బెల్లం పొడి (5 స్పూన్లు), జీలకర్ర పొడి (ఒక చెంచా), నల్ల ఉప్పు.

తయారీ విధానం: ఉసిరికాయలను బాగా కడిగిన తర్వాత.. స్టౌ మీద గిన్నె పెట్టుకుని .. ఉసిరికాయలు నీరు వేసుకుని మెత్తబడే వరకు ఉడికించాలి. ఉసిరి గింజలను తీసివేసి.. ఉసిరి గుజ్జుని పక్కన పెట్టుకోండి. మరోవైపు పాన్‌లో నీరు, బెల్లం, ఉసిరికాయ గుజ్జును కలపండి. కొంచెం సేపు స్విమ్ లో ఉడికించి నల్ల ఉప్పు వేసుకోండి. దీంతో ఆమ్లా సాస్ రెడీ. ఈ సాస్ ను మొలకలు, భేల్ లేదా టిక్కీతో కలిపి సర్వ్ చేయవచ్చు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయి. ఇందులో ఉన్న విటమిన్ సి .. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ లోపాన్ని అధిగమించడానికి ఆమ్లా సాస్ మంచి సహాయకారి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.