Iron Deficiency: ఐరన్ లోపంతో ఈ అనారోగ్య సమస్యలు.. షాకింగ్ విషయాలు..నిపుణులు చెబుతుందేంటి?
శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ స్థాయిలను నియత్రించడంలో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు మానసిక కల్లోలం, శరీరం సోమరితనంగా మారడం, మైకం వంటి లక్షణాలను గమనిస్తుంటారు.
శరీరంలో ఐరన్ ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. అయితే మారుతున్న ఆహార అలవాట్ల నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఐరన్ శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ స్థాయిలను నియత్రించడంలో ఇది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు మానసిక కల్లోలం, శరీరం సోమరితనంగా మారడం, మైకం వంటి లక్షణాలను గమనిస్తుంటారు.
ఐరన్ లోపానికి సూచనలు
మనం ఐరన్ లోపంతో బాధపడుతున్నాం అని తెలపడానికి శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుంది. శ్వాస సమస్యలు, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, నోటి నొప్పి, వాపు, కాళ్ల నొప్పులు వస్తే మనం ఐరన్ లోపమని గమినించుకోవచ్చు. ఒకవేళ మహిళలు అధిక ఐరన్ లోపంతో బాధపడుతుంటే వారికి రుతుక్రమ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓ సర్వే ప్రకారం దాదాపు 50 శాతం మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని తేలింది. ఐరన్ లోపం వల్ల ఆక్సిజన్ స్థాయిల్లో సమస్య వస్తుందని తేలింది. దీంతో వారికి హెవీ పిరయడ్స్ వల్ల అధిక రక్త నష్టానికి కారణమవుతుంది. గర్భిణులు ఐరన్ లోపంతో బాధపడితే నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో శిశువు బరువు సమస్యతో బాధపడతారని, అలాగే గర్భిణులు కూడా డిప్రెషన్ వంటి బాధలు ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. సరైనా ఆహారం తీసుకోకపోవడం, అధికంగా రక్తాన్ని కోల్పోవడం, ఐరన్ గ్రహించే శరీర సామర్థ్యం తగ్గడం వల్ల ఐరన్ లోప సమస్యలు వస్తాయి.
ఇలా చేస్తే ఐరన్ లోపం దూరం
ఐరన్ లోపాన్ని ముందే గుర్తించపోతే గుండె సమస్యలకు కారణం కూడా అవుతుందని నిపుణులు అంటున్నారు. ఐరన్ లోపం సమస్య నుంచి బయటపడాలంటే ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మేలని సూచిస్తున్నారు. అసలు ఆహారాల్లో రెండు రకాల ఇనుము ఉంటుంది. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ మాంసాహారాల్లో ఎక్కువ లభిస్తుంది. అలాగే నాన్ హీమ్ ఐరన్ ఆకు కూరలు వంటి వాటిల్లో ఉంటాయి. కోడి మాంసం, వేట మాంసం ఉత్పత్తులు, సీ ఫుడ్స్, గుడ్లు, బీన్స్, బచ్చలి కూర, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు, ఐరన్ పోర్టిఫైడ్ తృణ ధాన్యాలు, బటానీలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు. సాధారణంగా శరీరం మాంసాహార ఉత్పత్తులను తీసుకుంటే అధికంగా ఐరన్ ను సంగ్రహిస్తుంది. కానీ వెజ్ టేరియన్లు అయితే విటమిన్ -సీ ఉత్పత్తుల తీసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే బ్రొకలీ, టమాటోలు, కివీస్, నారింజ, స్ట్రా బెర్రీ వంటి ఉత్పత్తులు తీసుకుంటే మంచిది. అయితే కొంత మంది ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. కానీ అవి తీసుకుంటే ఇతర సమస్యలకు కారణం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..