Iron Deficiency: మీ శరీరంలో ఐరన్ లోపం ఉందా? ఈ లక్షణాలను అస్సలు విస్మరించొద్దు..
శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఐరన్ లోపం మహిళల్లో సర్వసాధారణం. అయితే, అధిక ఋతు రక్తస్రావం సమయంలో ఐరన్ చాలా అవసరం.
శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఐరన్ లోపం మహిళల్లో సర్వసాధారణం. అయితే, అధిక ఋతు రక్తస్రావం సమయంలో ఐరన్ చాలా అవసరం. దాని లోపం కారణంగా అనేక మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. హిమోగ్లోబిన్‌లో ఐరన్ చాలా ముఖ్యమైన భాగం. ఐరన్ లోపిస్తే.. రక్త హీనత సమస్య తలెత్తుతుంది. నిపుణుల ప్రకారం.. ఐరన్ లోపాన్ని సహజ సిద్ధమైన ఆహారాు, మందులు తీసుకోవడం ద్వారా సరిచేయొచ్చు. అయితే, ఐరన్ లోపం వల్ల శరీరం రక్తహీనతకు గురవుతుంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. సాధారణ లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిరంతరం అలసిపోయినట్లుగా ఉండటం..
కారణం లేకుండా అలసటగా అనిపించడం శరీరంలో ఐరన్ లోపానికి సంకేతం. ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. దీని కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలో శక్తి లోపించి అలసిపోయినట్లు అనిపిస్తుంది. చర్మం లేతగా, నిర్ణీవంగా కనిపించడం ప్రారంభం అవుతుంది. అది కూడా ఐరన్ లోపానికి సంకేతం. శరీరంలో రక్త హీనత కారణంగా ముఖం నుంచి గోళ్ల వరకు పసుపు రంగులోకి మారుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..
ఐరణ్ లోపం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ కండరాలు, కణజాలాలకు చేరదు. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది.
హృదయ స్పందన పెరగడం..
ఐరన్ లోపం కారణంగా హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల ఆక్సీజన్ గుండెకు సరిగా చేరదు. ఇది క్రమరహిత హృదయ స్పందనకు కారణం అవుతుంది.
జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం..
పొడి చర్మం, జుట్టు రాలిపోవడం కూడా ఐరన్ లోపానికి సూచికలు. పొడి గోర్లు కూడా ఐరన్ లోపానికి సంకేతం. ఈ సంకేతాలన్నీ ముందుగా గుర్తిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు పాటించడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..