Smart Phone Checking: మీరు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ నకిలీదా? ఒరిజినలా? ఇలా తెలుసుకోండి..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Nov 08, 2022 | 8:02 AM

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ఉపయోగించని వారు చాలా చాలా అరుదే అని చెప్పాలి. ఎందుకంటే.. ఆహారం లేకుండా అయినా ఉండగలరు కానీ, ఫోన్ లేకుంటే మాత్రం..

Smart Phone Checking: మీరు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ నకిలీదా? ఒరిజినలా? ఇలా తెలుసుకోండి..
Smart Phone

ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ఉపయోగించని వారు చాలా చాలా అరుదే అని చెప్పాలి. ఎందుకంటే.. ఆహారం లేకుండా అయినా ఉండగలరు కానీ, ఫోన్ లేకుంటే మాత్రం ఉండలేకపోతున్నారు. అంతలా ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు జనాలు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ ఫోన్‌ను వినియోగిస్తున్నారు. ఫోన్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతీ పనిని ఫోన్ ద్వారానే చేస్తుండటంతో.. అందరూ ఫోన్‌ను వాడేస్తున్నారు. దీనికి తోడు.. మొబైల్ తయారీ కంపెనీలు సైతం నిత్యం సరికొత్త ఫీచర్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. తక్కువ ధరకే.. అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్లను మార్కెట్‌లోకి వదులుతున్నాయి. టాప్ బ్రాండ్స్ నుంచి తక్కువ స్థాయి బ్రాండ్స్ వరకు అన్ని రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.

అయితే, మార్కెట్‌లో ఈ బ్రాండ్స్ పేరిట పెద్ద మోసం జరుగుతోంది. కొందరు కేటుగాళ్లు మొబైళ్లను ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఒరిజనల్ ఫోన్లకు బదులు డమ్మీ ఫోన్లను కస్టమర్లకు కట్టబెడుతున్నారు. ఒరిజినల్ ఫోన్లలోని బాడీ పార్ట్స్ తీసేసి, డమ్మీ పార్ట్స్ వేస్తున్నారు. పైకి బ్రాండ్ సింబల్, బాడీ కటౌట్ అన్నీ సేమ్ ఉన్నా.. అసలు కత వేరే ఉంటుంది. అయితే, మరి మీరు కొనుగోలు చేసిన మొబల్ ఒరిజినలా? డమ్మీనా? ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్ అంటున్నారు నిపుణులు.

మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ ఒరిజినలా? డిప్లికేటా? అనేది తెలుసుకోవాలంటే.. ముందుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఒక మెసేజ్ చేయాలి. మీ మొబైల్ ఫోన్ నుంచి KYM అని టైప్ చేసి స్పేస్ ఇవ్వాలి. ఆ తరువాత 15 అంకెలు గల IMEI నెంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం 14422 కి మెసేజ్ సెండ్ చేయాలి. కొంత సమయం తరువాత మీ మొబైల్‌కు రిప్లై వస్తుంది. మీ మొబైల్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం ఆ మెసేజ్‌లో ఉంటుంది.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu