Earthquake: ఉత్తర భారతాన్ని షేక్ చేసిన భూకంపం.. 20 సెకన్ల పాటు కంపించిన భూమి..

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భూకంపం హడలెత్తించింది. ఒకే సమయంలో అనేక రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం సంభవించింది.

Earthquake: ఉత్తర భారతాన్ని షేక్ చేసిన భూకంపం.. 20 సెకన్ల పాటు కంపించిన భూమి..
Earthquake
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 09, 2022 | 2:25 AM

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భూకంపం హడలెత్తించింది. ఒకే సమయంలో అనేక రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం సంభవించింది. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.7 గా నమోదైంది. అయితే, అర్థరాత్రి భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రాణ భయంతో బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా సమయం పాటు భూమి కంపించడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపై నిల్చున్నారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తోంది. కాగా, డిల్లీతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనూ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. లక్నోలో కూడా అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. స్థానిక ప్రజలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు మణిపూర్‌లోనూ భూకంపం సంభవించింది.

ఇక భారతదేశంతో పాటు.. చైనా, నేపాల్ దేశాల్లోనూ భూకంపం వచ్చినట్లు భారత జాతీయ భూకంప పరిశీలన కేంద్రం ప్రకటించింది. ఇక మన దేశంలోని పలు చోట్ల భూకంప తీవ్రత 6.3 గా నమోదైనట్లు వెల్లడించారు అధికారులు. భూకంప కేంద్రం నేపాల్‌, భారత్ సరిహద్దు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు తెలిపారు అధికారులు. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..