AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Branches: ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా బాబూ.. ఏకంగా 9 జిల్లాల్లో ఫేక్ బ్యాంకులు పెట్టేశారు.. కట్ చేస్తే సీన్ సితారే..

మీరు వింటున్నది, కంటున్నది నిజమే. నకిలీ బ్యాంక్ అకౌంట్లు కాదు.. ఏకంగా బ్యాంకులనే ఏర్పాటు చేశారు కొందరు కేటుగాళ్లు. ప్రస్తుతం ఈ ఉత్తుత్తి బ్యాంక్‌ల..

Bank Branches: ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా బాబూ.. ఏకంగా 9 జిల్లాల్లో ఫేక్ బ్యాంకులు పెట్టేశారు.. కట్ చేస్తే సీన్ సితారే..
Tamil Nadu Fake Banks
Shiva Prajapati
|

Updated on: Nov 09, 2022 | 7:05 AM

Share

మీరు వింటున్నది, కంటున్నది నిజమే. నకిలీ బ్యాంక్ అకౌంట్లు కాదు.. ఏకంగా బ్యాంకులనే ఏర్పాటు చేశారు కొందరు కేటుగాళ్లు. ప్రస్తుతం ఈ ఉత్తుత్తి బ్యాంక్‌ల మాఫియా తమిళనాడును కుదిపేస్తోంది. ఎలా అనుమానం వచ్చిందో, లేదంటే ఎవరైనా బాధితులు సమాచారం ఇచ్చారోగనీ.. ఒకేసారి తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో పుట్టిన బ్యాంక్‌లపై పోలీసులు ఏకకాలంలో స్టింగ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 9 జిల్లాల్లో విస్తరించిన నకిలీ బ్యాంక్‌ల గుట్టును ఛేదించారు.

అవును.. ఫేక్ సర్టిఫికెట్లు, ఆహార కల్తీ, పాల కల్తీ, ఇతర ఫేక్ గాళ్లు, ముఠాల గురించి విన్నాం, చూశాం కానీ.. ఏకంగా బ్యాంకులను సైతం నకిలీవి ఏర్పాటు చేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. తమిళనాడులో నిజమైన బ్యాంకులను పోలిన విధంగా ఉత్తుత్తి బ్యాంకులను ఏర్పాటు చేశారు కేటుగాళ్లు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 జిల్లాల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఒరిజినల్ బ్యాంక్‌లకు ఏమాత్రం తీసిపోని రీతిలో హంగులు, ఆర్బాటాలు చేశారు కేటుగాళ్లు. 46 మంది సిబ్బందితో పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థనే ఏర్పాటు చేశారు. దాంతో ఇవి నిజమైన బ్యాంకులే అని నమ్మిన ప్రజలు.. ఆయా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి డబ్బులు డిపాజిట్ చేశారు. దాదాపు 2 వేల మంది ఖాతాదారుల నుంచి లక్షలు, కోట్ల కొద్దీ డిపాజిట్లు చేయించారు కేటుగాళ్లు.

తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో.. చెన్నై సహా మధురై, నామక్కల్, సేలం, ఈరోడ్ జిల్లాల్లోనూ వేరు వేరు పేర్లతో బ్యాంకులను విస్తరించారు. అయితే, అనతి కాలంలో పుట్టగొడుగుల్లా బ్యాంకులు పుట్టుకురావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగి.. స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ వ్యవస్థ అంతా వట్టి ఫేక్ అని తేల్చారు పోలీసులు. ఫేక్ బ్యాంకులో సిబ్బందిగా పని చేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి ప్రస్తుతానికి రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, పాస్‌బుక్‌లు, డిబిట్‌కార్డులు, స్టాంప్‌లు ఇతర లావాదేవీల సామాగ్రి గుర్తించారు. ఈ ఫేక్ బ్యాంకుల వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఉత్తుత్తి బ్యాంక్‌ల మాఫియా వెనుక కింగ్‌పిన్‌ ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. నిజంగానే.. ఈ కేటుగాళ్లు ఎంత తెగించి ఉంటే, ఎంత నెట్‌వర్క్ ఉంటే ఏకంగా ఇలా బ్యాంకులనే ఏర్పాటు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..