PM Kisan Yojana: ఈ తప్పుల వల్ల 12 విడత నిధులు నిలిచిపోవచ్చు.. 13వ విడత నిధులు పొందాలంటే ఈ పని చేయండి..
అక్టోబర్ 17, 2022న న్యూఢిల్లీలో జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ యోజన పథకం కింద 12వ విడత సొమ్మును దేశవ్యాప్తంగా..
అక్టోబర్ 17, 2022న న్యూఢిల్లీలో జరిగిన కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ యోజన పథకం కింద 12వ విడత సొమ్మును దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు డీబీటీ ద్వారా రూ.16 వేల కోట్లు చేరాయి. అయితే 12వ విడత విడుదలై చాలా రోజులు గడిచింది. ఇప్పటికీ చాలామంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన డబ్బులు పడలేదు. దానికి కొన్ని కారణాలున్నాయని అధికారులు చెబుతున్నాయి. అర్హత కలిగిన, లబ్ధిదారులైన రైతులు చేసే చిన్న పొరపాట్ల కారణంగా 12వ విడత నిధులు వారికి పడకపోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ తప్పుగా నమోదు చేసినట్లయితే ఇలా జరుగుతుంది. మరి రైతులు చేసే తప్పులేంటి? తదుపరి విడత నిధులు పడాలంటే ఏం చేయాలి? దాని విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తదుపరి విడత నిధులు తమ తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు ముందుగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ని సందర్శించాలి. ఇక్కడ ఫార్మర్స్ ఆప్షన్‌లోని బెనిఫిషియరీ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పీఎం కిసాన్ అకౌంట్ నెంబర్ గానీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ గానీ నమోదు చేయాలి. ఇప్పుడు రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి, గెట్ డేటాపై క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, రైతుకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేయాలి. గెట్ డేటాపై క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత స్క్రీన్‌పై వివరాలన్నీ ప్రదర్శించడం జరుగుతుంది. నమోదిత వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అనంతరం సబ్మిట్ కొట్టాలి. ఇలా కాకుండా పీఎం కిసాన్ యోజన హెల్ప్‌లైన్ నెంబర్లు 155261, 1800115526 లేదా 011 23381092కు కాల్ చేయడం ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..