Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం.. ఆమ్‌ఆద్మీ పార్టీకి కష్టాలు.. అప్రూవర్‌గా మారిన నిందితుడు..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. నిందితుడిగా ఉన్న దినేశ్‌ అరోరా సీబీఐకి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అరోరా..

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం.. ఆమ్‌ఆద్మీ పార్టీకి కష్టాలు.. అప్రూవర్‌గా మారిన నిందితుడు..
Delhi Liquor Scam
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 08, 2022 | 6:26 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. నిందితుడిగా ఉన్న దినేశ్‌ అరోరా సీబీఐకి అప్రూవర్‌గా మారారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అరోరా అత్యంత సన్నిహితుడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని , నవంబర్‌ 14న కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు దినేశ్‌ అరోరా. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆమ్‌ఆద్మీ పార్టీకి కష్టాలు మరింత పెరిగాయి. దినేశ్‌ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారారు.డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరోరా సన్నిహితుడు. కొద్దిరోజుల క్రితమే సీబీఐ కోర్టు దినేశ్‌ అరోరాకు లిక్కర్‌ స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. నవంబర్‌ 14వ తేదీన దినేష్‌ అరోరా స్టేట్‌మెంట్‌ను సీబీఐ కోర్టు రికార్డు చేయబోతోంది.

తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్న అరోరా..

సీబీఐ దర్యాప్తుకు సహకరించానని , తాను చేసిన తప్పులను కోర్టుకు వెల్లడించేందుకు సిద్దంగా ఉన్నట్టు దినేశ్‌ అరోరా వెల్లడించారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా తెలిపారు. సీబీఐ తనపై ఒత్తిడి చేయలేదని వివరించారు. లిక్కర్‌ స్కాంలో నిందితుడిగా ఉన్న దినేశ్‌ అరోరాను సీబీఐ విచారించింది. సీఎం కేజ్రీవాల్‌తో పాటు సిసోడియాకు దినేశ్‌ అరోరా చాలా సన్నిహితుడని బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ ఆరోపించారు. అతిత్వరలో లిక్కర్‌ స్కాంలో సిసోడియాను జైలుకు పంపడం ఖాయమన్నారు.

అరోరాకు చెందిన రాధా ఇండస్ట్రీస్‌కు మరో నిందితుడు సమీర్‌ మహేంద్రు బ్యాంక్‌ ఖాతా నుంచి కోటి రూపాయలు బదిలీ అయినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దినేష్‌ అరోరా బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. అక్రమంగా మద్యం లైసెన్స్‌లు జారీ చేసినట్టు కేసు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీలో 35 ప్రాంతాల్లో సోదాలు చేసింది. డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 14 మందిపై కేసులు నమోదయ్యాయి. కొత్త లిక్కర్‌ పాలసీతో ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
ఉదయాన్నే ఈ పనులు చేస్తే కిడ్నీలు హెల్దీగా ఉంటాయి..
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??