AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: కేజీఎఫ్ -2 మూవీ సెగ.. కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఆ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశం..

కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు.. కేజీఎఫ్ చాఫ్టర్-2 సినిమా సెగ తగిలింది. కేజీఎఫ్ చిత్రంలోని పాటలు, మ్యూజిక్‌ను అక్రమంగా వినియోగించుకున్నారన్న కేసుపై బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.

Congress: కేజీఎఫ్ -2 మూవీ సెగ.. కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఆ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశం..
Bharat Jodo Yatra
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2022 | 9:55 PM

Share

కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు.. కేజీఎఫ్ చాఫ్టర్-2 సినిమా సెగ తగిలింది. కేజీఎఫ్ చిత్రంలోని పాటలు, మ్యూజిక్‌ను అక్రమంగా వినియోగించుకున్నారన్న కేసుపై బెంగళూరు కోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం, నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలంటూ ట్విట్టర్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీతోపాటు భారత్ జోడో యాత్ర, రాహుల్, జైరాం రమేష్, సుప్రియ ట్విట్టర్ ఖాతాలను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగుళూరు కోర్టు ఆదేశించింది.

MRT సంస్థకి సంబందించిన KGF 2 చిత్రంలోని పాటలను కాంగ్రెస్ అనుమతి లేకుండా తమ క్యాంపెయిన్‌కి వాడుకొందని ఆ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. ఎంఆర్‌టి సంస్థ ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనతేలపై యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనిపై విచారించిన బెంగళూరు కోర్టు.. మ్యూజిక్ కాపీరైట్ కేసు కింద కాంగ్రెస్ పార్టీతోపాటు భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని బెంగళూరు కోర్టు ట్విట్టర్‌ని ఆదేశించింది.

కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమకు అధికారికంగా ఏటువంటి కోర్టు ఆర్డర్ రాలేదని, సోషల్ మీడియాలో మాత్రమే దీనికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం అంటూ జవాబిచ్చింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని.. మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే