AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Thakur: నడి రోడ్డుపై ఆగిపోయిన బస్సు.. కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్‌..

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తన హోదాను సైతం పక్కన పెట్టి అందరిలో ఒకరిగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం..

Anurag Thakur: నడి రోడ్డుపై ఆగిపోయిన బస్సు.. కేంద్ర మంత్రి చేసిన పనికి అంతా షాక్‌..
Anurag Thakur
Narender Vaitla
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 08, 2022 | 10:15 PM

Share

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. తన హోదాను సైతం పక్కన పెట్టి అందరిలో ఒకరిగా వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం రాత్రి హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్పూర్‌లో రహదారిపై ప్రయణిస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఓ బస్సు ఆగిపోయింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అయితే ఆ ట్రాఫిక్‌లో అనురాగ్ ఠాకూర్‌ ప్రయాణిస్తున్న కారు కూడా చిక్కుకుంది. వెంటనే కారు దిగిన అనురాగ్ ఏం జరిగిందా అని పరిశీలించారు.

బస్సు ఆగిపోయిందన్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బస్సువు వద్దకు వెళ్లాడు. డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా బస్సు ఇంజన్‌ ఆన్‌ కాకపోవడంతో అక్కడనున్న వారంతా బస్సును రోడ్డు పక్కకు జరిపేందుకు తోయడం మొదలు పెట్టారు. అక్కడనున్న వారంతా తలా ఓ చేయి వేయడంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కూడా అందరితో కలిసి బస్సును వెనక్కి నెట్టారు. దీనంతటినీ అక్కడున్న వారు ఫోన్‌లో రికార్డ్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా బస్సు నెట్టడం గ్రేట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్‌ 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ బాట పడుతున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కూడా ప్రచారానికి వెళ్తున్న సమయంలోనే ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ