Prawn Biryani: సీఫుడ్ లవర్స్ కోసం.. కొబ్బరిపాలతో కోడి గుడ్డు, రొయ్యల బిర్యానీ రెసిపీ.. ట్రై చేసి ఎంజాయ్ చేయండి
నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్, మటన్ లతో పాటు, రొయ్యలు, పీతలు వంటి బిర్యానీలను టేస్టీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో సీఫుడ్ లో రారాజు రొయ్యలు కోడిగుడ్డు బిర్యానీ తయారీ నేర్చుకుందాం..!
కాలం రోజు రోజుకీ మారుతోంది.. దీంతో మనిషి ఆలోచనలోనేకాదు.. తినే ఆహారం, ధరించే దుస్తుల దగ్గర నుంచి అనేక మార్పులు వచ్చాయి. అయినప్పటికీ అమ్మమ్మ నాటి ఫుడ్ గుర్తుకు వచ్చిందంటే చాలు.. వెంటనే నోట్లోకి నీరు వస్తుంది.. రోజూ తినే ఫుడ్ కు చెక్ చెప్పి.. డిఫరెంట్ ఫుడ్ ను తిండడానికి పిల్లలైనా. పెద్దలైనా ఆసక్తి చూపిస్తారు.. ప్రస్తుతం ఎక్కువ మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు. డిఫరెంట్ బిర్యానీలను ఇష్టంగా తింటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు అయితే చికెన్, మటన్ లతో పాటు, రొయ్యలు, పీతలు వంటి బిర్యానీలను టేస్టీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో సీఫుడ్ లో రారాజు రొయ్యల బిర్యానీ తయారీ నేర్చుకుందాం..!
గోదావరి జిల్లా వాసులకు ఈ రొయ్యలతో ప్రత్యేక అనుబంధం ఉంది. రోజు ఏదొక కూరలో రొయ్యలను వేసి కూర తయారు చేస్తారు. ఇక కోడి గుడ్డు రొయ్యల బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది. అయితే నీరుకి బదులు కొబ్బరి పాలను ఉపయోగించి సూపర్ టేస్టీ రొయ్యల బిర్యానీ ని తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
సముద్రం రొయ్యలు – 1 కిలో
కోడి గుడ్లు-6
బాస్మతి బియ్యం – 2 కప్పులు
కొబ్బరి పాలు-2 కప్పు
ఉల్లిపాయలు – 4 (పొడవుగా తరిగినవి)
టొమాటోలు – 3 (చిన్నగా తరిగినవి)
ధనియాల పొడి – 2 టీస్పూన్లు
కొత్తిమీర
పుదీనా ఆకులు
దాల్చిన చెక్క
లవంగాలు,
యాలకులు,
బిర్యానీ ఆకులు
అనాస పువ్వు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్
నూనె – సరిపడినంత
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – కొంచెం
కారం – రుచికి సరిపడా
మసాలా పేస్టు తయారీకి కావలసిన పదార్థాలు:
పచ్చిమిరపకాయలు
ఎండుమిరపకాయలు
అల్లం,వెల్లుల్లి రెమ్మలు
చిన్న ఉల్లిపాయలు – 10
తురిమిన పచ్చికొబ్బరి కొంచెం
పుదీనా
కొత్తిమీర
తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట సేపు నీటిలో నానబెట్టండి. అనంతరం రొయ్యలను శుభ్రం చేసుకుని.. పసుపు, ఉప్పు వేసి కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని రొయ్యలల్లో ఒక టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్ కోసం మిక్సీ గిన్నె తీసుకుని అందులో పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి. కొంచెం పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా వేసుకుని కొంచెం నీరు పోసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా రెండు కప్పుల కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. గుడ్లు ఉడికించుకుని పెంకు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌ వెలిగించి దాని మీద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత నూనె, నెయ్యి వేసుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత ఉడికించిన గుడ్లను బ్రౌన్ కలర్ లోకి వచ్చేలా వేయించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరికొంచెం నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, అనాస పువ్వు వేసుకుని వేయించుకోవాలి. పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసుకుని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేవరకూ వేయించి.. టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని కలుపుకోవాలి. ఇలా వేయించిన తర్వాత.. ముందుగా రెడీ చేసుకున్న రొయ్యలు వేసుకుని వేయించాలి. ఇలా ఒక 5 నిముషాలు వేయించిన తర్వాత..రెడీ చేసిన కొబ్బరి పాలు వేసుకుని కలిపాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా చేసుకుని కొబ్బరి పాలలో వేసుకుని ఒక్కసారి కలిపి.. ఇప్పుడు వేడి ఎక్కిన తర్వాత కోడిగుడ్లను వేసుకుని ఉప్పు చూసుకుని కుక్కర్ మూత పెట్టాలి.. మీడియం మంటలో 8నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే ఆంధ్రా స్టైల్ లో టేస్టీ టేస్టీ కొబ్బరి పాలతో రొయ్యలు, గుడ్ల బిర్యానీ రెడీ..
రొయ్యలు. ఇవి మంచి పౌష్టికాహారం.. అంతేకాదు రొయ్యలు బరువు తగ్గడానికి మంచి సహకారిగా ఉపయోగపడుతుంది. డైట్ చేసే వారు రొయ్యలను తమ ఆహారంలో చేర్చుకోమని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. అయితే ఈ రొయ్యలతో అనేక రకాల వంటలను తయారు చేయవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..