Mixed Vegetable Soup: బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్.. ఓట్స్ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ రెసిపీ.. మీకోసం
శీతాకాలంలో రాత్రి అన్నం వంటి ఆహార పదార్ధాల బదులు సూపర్ ఫుడ్ ఓట్స్ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ మంచిదని మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ సూప్ సూపర్ ఫుడ్. రుచికరమైన పోషకాలతో నిండి ఉంటుంది.
మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన శైలీలో కూడా భిన్నమైన మార్పులు వచ్చాయి. దీంతో ఆరోగ్యంగా ఉండాలంటే.. తగిన శారీరక శ్రమ, సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నో సీజనల్ వ్యాధులను తీసుకొచ్చే శీతాకాలంలో వ్యాయామంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే చలికాలంలో చాలామందికి రాత్రి సమయంలో అన్నం తినాలని అనిపించదు. వేడివేడిగా ఏదైనా ఆహారంగా తీసుకోవాలని భావిస్తారు. అయితే శీతాకాలంలో రాత్రి అన్నం వంటి ఆహార పదార్ధాల బదులు సూపర్ ఫుడ్ ఓట్స్ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ మంచిదని మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ సూప్ సూపర్ ఫుడ్. రుచికరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఈ శీతాకాలంలో ఈ ఆరోగ్యకరమైన ఓట్స్ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ ని ప్రయత్నించండి ఆస్వాదించండి.. ఈరోజు ఓట్స్ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ తయారి గురించి తెలుసుకుందాం..
కావలిసిన పదార్ధాలు:
మసాలా ఓట్స్ – రెండు స్పూన్లు క్యారెట్- రెండు కప్పుల ముక్కలు క్యాబేజీ – ఒక కప్పు ముక్కలు క్యాప్సికమ్ – ఒక కప్పు ముక్కలు పాలకూర- ఒక కప్పు ఆలివ్ ఆయిల్- ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి – 10 రెమ్మలు అల్లం – కొంచెం నీరు – 3 గ్లాసులు
తయారీ విధానం: ముందుగా తీసుకున్న కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. అందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత.. క్యారెట్ ముక్కలను వేసి కొంచెం సేపు వేయించండి.. తర్వాత క్యాబేజీ ముక్కలను వేసి వేయించి ఇపుడు క్యాప్సికమ్,పాలకూరను వేసి వేగనివ్వండి. ఈ వెజిటల్స్ నూనెలో మగ్గిన తర్వాత మూడు గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత అందులో రెండు స్పూన్ సఫోలా మసాలా ఓట్స్ కలపండి. కొంచెం సేపు ఉడికించండి.. అంతే టేస్టీ టేస్టీ హెల్తీ మిక్సిడ్ వెజిటబుల్ సూప్ రెడీ. బరువు తగ్గాలనుకునేవారికి ఈ సూప్ సూపర్ ఫుడ్. డిన్నర్ మానేసి ఈ సూప్ తీసుకోండి. శరీరానికి కావలసిన అన్ని విటమిన్స్ మినరల్స్ అందుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..