UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే నుంచి పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా.. ఇలా చేస్తే మీ డబ్బులు వెనక్కి..
UPI Payments: ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి.. లైన్‌లో నిల్చుని.. డిపాజిట్ అప్లికేషన్ పూర్తిచేసి.. డబ్బులు జమ చేయాల్సి వచ్చేది.. ఇది పూర్తిగా గతం.. ప్రస్తుతం.. డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకు ఖాతాకు..
UPI Payments: ఎవరికైనా డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి.. లైన్‌లో నిల్చుని.. డిపాజిట్ అప్లికేషన్ పూర్తిచేసి.. డబ్బులు జమ చేయాల్సి వచ్చేది.. ఇది పూర్తిగా గతం.. ప్రస్తుతం.. డిజిటల్ యుగం నడుస్తోంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఉంటే చాలు.. కొన్ని డిజిటల్ యాప్‌లు ఉపయోగించి.. క్షణాల్లో డబ్బులు బదిలీ చేయవచ్చు. అంతేకాదు.. యాప్ యొక్క యూపీఐ ఐడి తెలిసినా చాలు.. ఏ యాప్ నుంచి వేరు యాప్ కైనా.. నగదు బదిలీ చేయవచ్చు. ఎలా చేసినా.. ఈడబ్బులు ఖాతాదారుడి అకౌంట్‌లో జమ అవుతాయి. నగదు బదిలీకి ఎంతో సులభమైన మార్గం అయినప్పటికి.. కొన్ని సందర్భాల్లో అనుకోని పొరపాట్లు చేస్తుంటారు. ఒక నెంబర్‌కు బదులు మరొక నెంబర్ ఎంటర్ చేయడం లేదా.. యూపీఐ ఐడి తప్పుగా ఎంటర్ చేయడం వంటివి సహజంగా చేస్తుంటారు. అలాంటి సమయాల్లో మన డబ్బులు పోయినట్లే అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే డబ్బులు ఒక యూపీఐ ఐడికి బదులు మరో యూపిఐ ఐడికి పొరపాటున బదిలీ చేస్తే.. ఆ డబ్బులు తిరిగి పొందేందుకు ఏమి చేయాలో తెలుసుకుందాం.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో నగదు లావాదేవీల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. QR కోడ్‌ను స్కాన్ చేయడం లేదా.. యూపీఐ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సులభంగా బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేసే విధానం రావడం తర్వాత.. నగదు వినియోగం చాలా వరకు తగ్గింది. చివరికి టీ స్టాల్‌లో కూడా టీ తాగి యూపీఐ పేమెంట్స్ చేసే పరిస్థితి వచ్చింది. వీధి వ్యాపారుల నుండి రిటైల్ వర్తకుల వరకు ఎవరికైనా యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే సౌలభ్యం కారణంగా ఈ విధానం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో నగదు బదిలీ చేసేటప్పుడు UPI IDని తప్పుగా నమోదు చేయడం, పొరపాటున వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేయడం వంటివి సాధారణంగా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఎదుర్కొన్న కొన్ని తప్పులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళనకు గురవుతూ ఉంటారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వివరాలు తప్పుగా నమోదు చేసి.. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేయబడిన డబ్బును తిరిగి పొందవచ్చు.
డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి ఏ యాప్ ఉపయోగించి చెల్లింపులు చేశారో అదే యాప్‌లో ఫిర్యాదు చేయాలి.
Paytm, Google Pay లేదా PhonePe వంటి యాప్‌లలో కస్టమర్ కేర్ నుంచి సహాయం తీసుకోవచ్చు, అదే సమయంలో డబ్బులు వాపసు కోసం అభ్యర్థించవచ్చు.
చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే, డిజిటల్ లావాదేవీల కోసం RBI ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
UPI, భారత్ క్యూఆర్ కోడ్, ఇతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించిన RBI సూచనలను చెల్లింపు వ్యవస్థ సకాలంలో పాటించనప్పుడు, లబ్ధిదారుల ఖాతాకు నిధులను జమ చేయడంలో వైఫల్యం చెందితే దానికి సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు.
లబ్ధిదారుని ఖాతాకు తప్పుగా నిధులు బదిలీ అయినప్పుడు ఎవరైనా RBI ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..