AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: రూ.5వేల పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించండి.. భవిష్యత్తు ఉన్న వ్యాపారం..

Business Idea: చాలా మంది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించే వ్యాపారం కోసం వెతుకుతూ ఉంటారు. కొన్ని విజయవంతమైతే.. మరికొన్ని వ్యాపారాల్లో నస్టాలు చవి చూడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు కంగారు పడకుండా.. భవిష్యత్తు ఉన్న

Business Idea: రూ.5వేల పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించండి.. భవిష్యత్తు ఉన్న వ్యాపారం..
Kulhad Making
Amarnadh Daneti
|

Updated on: Dec 26, 2022 | 12:46 PM

Share

Profitable Business: చాలా మంది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సంపాదించే వ్యాపారం కోసం వెతుకుతూ ఉంటారు. కొన్ని విజయవంతమైతే.. మరికొన్ని వ్యాపారాల్లో నస్టాలు చవి చూడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు కంగారు పడకుండా.. భవిష్యత్తు ఉన్న వ్యాపారం ఏమిటనేది ఆలోచించుకోవాలని చెబుతారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. భవిష్యత్తు బంగారుమయం కావాలంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే అవగాహనకు చాలామంది వస్తున్నారు. ఇప్పటివరకు దీనికి సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికి ప్లాస్టిక్‌ను వినియోగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టీ దుకాణాల్లో ప్లాస్టిక్‌ గ్లాసుల స్థానంలో పేపర్‌ గ్లాసులు వచ్చినా.. ఈ గ్లాసుల్లో టీ తాగడానికి పెద్దగా మక్కువ చూపించడంలేదు. ఈ సమయంలో మట్కా ఛాయ్ లేదా తందూరి ఛాయ్, ఇంకా చెప్పాలంటూ కుల్హాద్ ఛాయ్ అంటూ రకరకాల టీల పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి ఒకటే అర్ధం మట్టితో చేసిన కప్పుల్లో టీ విక్రయం. చాలా చోట్ల ప్రస్తుతం మట్టి కప్పుల్లో టీ విక్రయం పెరుగుతోంది. దీంతో మట్టితో తయారు చేసిన కప్పులకు డిమాండ్ పెరగనుంది. ఈక్రమంలో మట్కా తయారీ వ్యాపారం ఎలా లాభదాయకమో తెలుసుకుందాం.

మీరు స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే. కేవలం రూ.5వేల పెట్టుబడి పెట్టి సులభంగా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. నేటి కాలంలో, చాలా మంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. దీనిని ప్రస్తుతం పూర్తిగా నిషేధించారు. దీంతో ప్రత్యామ్నాయ ఎంపికలపై అంతా దృష్టిసారించారు. ఇలాంటి పరిస్థితిలో మట్కా (మట్టితో తయారుచేసిన వస్తువులు) వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కేవలం 5000 రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇలాంటి వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్రప్రభుత్వం ముద్ర యోజన కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించడంతో త్వరలో రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, విమానాశ్రయాలు, మాల్స్‌లో మట్టితో చేసిన కప్పులు లేదా వస్తువులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ప్రభుత్వ ప్రోత్సాహం

మట్టి వస్తువుల తయారీకి ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తోంది. అలాగే మట్టి కప్పుల తయారీకి నాణ్యమైన మట్టిని ఉపయోగిస్తారు. ఇది ఏదైనా నది లేదా చెరువు సమీపంలో దొరుకుతుంది. రెండవ ముడి పదార్థం అచ్చు. ఏ పరిమాణంలో కప్పు తయారు చేయాలనుకుంటున్నారో, ఆ పరిమాణం ప్రకారం మార్కెట్ నుండి అచ్చును కొనుగోలు చేయవచ్చు. మట్కా తయారు చేసిన తర్వాత, దానిని స్ట్రాంగ్ చేసేందుకు వేడి చేయాలి. దీని కోసం పెద్ద కొలిమి అవసరం. కప్పులను కాల్చిన తర్వాత.. వీటిని మార్కెట్లో విక్రయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

తక్కువ ఖర్చుతో తయారుకావడమే కాకుండా.. మట్టి కప్పులు పర్యావరణ పరంగా చాలా సురక్షితమైనవి. కేవలం టీ తాగేందుకే కాకుండా.. మట్టికప్పులను పాలు, జ్యూస్‌లు తాగడానికి వినియోగిస్తున్నారు. డిమాండ్ ఆధారంగా మంచి రేటు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించేందుకు మట్కా తయారీ ఓ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..