Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Batta Meka Pitta: ఈ అరుదైన పక్షి గురించి మీకు తెలుసా.. వీటి ప్రధాన స్థావరం ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతమే..

Batta Meka Bird Facts: పక్షుల పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే నేటి తరం ఎక్కువుగా చెప్పే పేర్లు కాకి, గద్ద, పావురం, చిలుక అంతకుమించి పక్షుల పేర్లు నేటి యువతకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. నేటి ఆధునిక కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. దీంతో పాటు.. ఎన్నో జంతుజాతులు, పక్షు జాతులు..

Batta Meka Pitta: ఈ అరుదైన పక్షి గురించి మీకు తెలుసా.. వీటి ప్రధాన స్థావరం ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతమే..
Batta Meka Bird
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 23, 2022 | 11:45 AM

Batta Meka Bird Interesting Facts: పక్షుల పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే నేటి తరం ఎక్కువుగా చెప్పే పేర్లు కాకి, గద్ద, పావురం, చిలుక అంతకుమించి పక్షుల పేర్లు నేటి యువతకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. నేటి ఆధునిక కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. దీంతో పాటు.. ఎన్నో జంతుజాతులు, పక్షు జాతులు అంతరించిపోతున్నాయి. వివిధ రాష్ట్రాలు వివిధ పక్షు జాతులకు ప్రసిద్ధి. కొన్ని జాతుల పక్షులు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. మనకు తెలియని పక్షు జాతులు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరెన్నో అంతరించిపోతున్నాయి. ఇలా అంతరించిపోతున్న పక్షు జాతుల్లో బట్టమేక పిట్ట ఒకటి. పేరే వెరైటీగా ఉంది కదూ.. పేరుకు తగినట్లుగా ఈ పక్షికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బట్టమేక పిట్ట ప్రధాన స్థావరం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈరకం పక్షులు ఆంధ్రప్రదేశ్‌లో గతంలో దాదాపు వందకు పైగా ఉండగా.. చాలా పక్షులు అంతరిస్తూ వస్తున్నాయి. దీంతో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో వందకు మించి ఈ పక్షులు లేవు. పూర్వం ఈ రకం పక్షులు అధికంగా ఉండగా.. వేటగాళ్ల ఉచ్చులకు బలై వాటిసంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని అటవీశాఖాధికారుల గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1979లో ముంబయికి చెందిన పరిశోధకులు బట్టమేక పిట్ట ప్రాధాన్యతను గుర్తించారు.

ప్రముఖ పక్షి శాస్తవ్రేత్త, నోబుల్ అవార్డు గ్రహిత సలీంఅలీ 1980లో రోళ్లపాడు వద్ద బట్టమేక పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. 1988లో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించి 600 హెక్టారుల భూమిని వీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలగనూరు గ్రామంవద్ద ఉన్న సుంకేసుల సమీపంలో 800 ఎకరాల భూమిని కేటాయించి వాటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు. బట్టమేక పక్షి ఒక మీటరు పొడవు, సుమారు 15 నుండి 20 కిలోల బరువుతో ఉండి, పొడవాటి మెడకలిగి వుంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధిచెందుతూ ఉండటం కూడా.. ఈ పక్షి జాతి అంతరించిపోవడానికి కారణంగా తెలుస్తోంది. కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమేపెట్టి దట్టమైన పొదల్లో 27 రోజులు గుడ్డును పొదుగుతుంది. బట్టమేక పక్షలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా వుంటు పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను భుజిస్తూ, పంటలను సంరక్షిస్తుంటాయి.

అంతరించిపోతున్న పక్షుల జాబితాలో..

తాజాగా పార్లమెంటులో కేంద్రప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం అంతరించిపోయే పక్షుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని బట్టమేక పిట్ట, కలివి కోడి, సరీసృపాల్లో గోదావరి నదిలో కనిపించే మెత్తని కవచం ఉండే తాబేలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబే తెలిపారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. బట్టమేక పిట్టలు ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో కలిపి 100 మాత్రమే ఉన్నాయన్నారు. వీటిలో ఎక్కువ ప్రస్తుతం రాజస్థాన్‌లో కనిపిస్తున్నాయన్నారు. కలివి కోడి పక్షులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీలంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. విపరీతమైన వేట కారణంగా మెత్తని కవచమున్న తాబేలు కనుమరుగయ్యే దశలో ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం చూడండి..