AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavad Geeta: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెంట్రల్ సిలబస్ లో పాఠ్యాంశంగా భగవద్గీత

జాతీయ విద్యా విధానం (NEP) 2022 పేరా 4.27 భారతదేశం సాంప్రదాయ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇది సుస్థిరమైనది. అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని మంత్రి అన్నపూర్ణాదేవి జోడించారు. అంతేకాదు.. "ఈ శతాబ్దంలో మనదేశం జ్ఞాన శక్తిగా ఎదగాలంటే, మనం మన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి.

Bhagavad Geeta: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెంట్రల్ సిలబస్ లో పాఠ్యాంశంగా భగవద్గీత
Bhagavad Gita In Center Syllabus
Surya Kala
|

Updated on: Dec 23, 2022 | 11:01 AM

Share

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సెంట్రల్ సిలబస్ లో 6, 7 తరగతుల్లో భగవద్గీతను పాఠ్యంశంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకుని వస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇక నుంచి భగవద్గీతను బోధించనున్నారు. అంతేకాదు భగవద్గీతలోని శ్లోకాలను 11, 12 తరగతుల్లో సంస్కృత పుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చనున్నట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి లోక్‌సభ లో తెలియజేశారు.

ఇంటర్ డిసిప్లినరీ, ట్రాన్స్-డిసిప్లినరీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) విభాగాన్ని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని..  వ్రాతపూర్వక సమాధానంలో విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ (IKS) లక్ష్యం.. అన్ని అంశాలపై పరిశోధన,  సామాజిక అనువర్తనాల కోసం IKS పరిజ్ఞానాన్ని సంరక్షించడంతో పాటు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం.

జాతీయ విద్యా విధానం (NEP) 2022 పేరా 4.27 భారతదేశం సాంప్రదాయ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఇది సుస్థిరమైనది. అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని మంత్రి అన్నపూర్ణాదేవి జోడించారు. అంతేకాదు.. “ఈ శతాబ్దంలో మనదేశం జ్ఞాన శక్తిగా ఎదగాలంటే, మనం మన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి.. ప్రపంచానికి ‘భారతీయ మార్గాన్ని’ నేర్పించాలి” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

భగవద్గీత.. మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలు  భగవద్గీతగా ప్రసిద్ధి. అయితే గీత ఒక ప్రత్యేక గ్రంథంగా విశిష్టతను సొంతం చేసుకుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం.. ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. గీతలో వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మ తత్వం,, జీవన గమ్యం, గమ్యసాధనా యోగాలు బోధించారు.

మరిన్ని కెరీర్ అండ్ నాలెడ్జ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..