AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Group – D Results: విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఎలా చూడాలంటే..

రాత పరీక్ష రాసి.. ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆర్ఆర్బీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. జోన్ల వారీగా...

RRB Group - D Results: విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఎలా చూడాలంటే..
Rrb Results
Ganesh Mudavath
|

Updated on: Dec 22, 2022 | 8:35 PM

Share

రాత పరీక్ష రాసి.. ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆర్ఆర్బీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. జోన్ల వారీగా రిజల్ట్స్ ప్రకటించింది. ఫలితాల కోసం ఆర్ఆర్బీ ప్రధాన వెబ్ సైట్ ను చూడాలని కోరింది. జోన్ల వారీగా ఆర్‌ఆర్‌బీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే భోపాల్‌, గువాహటి జోన్ల ఫలితాలు విడుదలయ్యాయి. సికింద్రాబాద్‌ సహా మిగతా జోన్ల ఫలితాలు రావాల్సి ఉంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే దేహధారుడ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని వివరించింది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని సూచించింది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నట్లు వివరించింది.

కాగా.. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటికి దాదాపు కోటి మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో నిర్వహించారు. అక్టోబర్‌లో ఈ పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్‌ విడుదల చేశారు.

సాధారణంగా గ్రూప్‌-డి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తవగా మరో రెండు దశలు జరగాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో క్వాలిఫై అయిన వారు వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!
టెస్టు క్రికెట్‌ హిస్టరీలో చెత్త రికార్డులో టీమిండియా జోడీ..!
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
డిగ్రీ అర్హతతో ఏపీలో 378 ఎస్‌ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్‌.. లింక్ ఇదే
డిగ్రీ అర్హతతో ఏపీలో 378 ఎస్‌ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్‌.. లింక్ ఇదే
రోజూ 2 గుడ్లు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! లాభాలు
రోజూ 2 గుడ్లు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! లాభాలు
పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
హాఫ్ సెంచరీతో ఆదుకున్న జవాన్ కొడుకు.. కోహ్లీ సరసన జురేల్
హాఫ్ సెంచరీతో ఆదుకున్న జవాన్ కొడుకు.. కోహ్లీ సరసన జురేల్
ఏపీలో 1156 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఏపీలో 1156 పోలీస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
శాంతించిన బంగారం ధరలు.. పెద్ద ఊరట వచ్చేసింది.. తులం ఎంతంటే..?
శాంతించిన బంగారం ధరలు.. పెద్ద ఊరట వచ్చేసింది.. తులం ఎంతంటే..?
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!
టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజు చెల్లింపునకు మరో అవకాశం!
చలి కాలంలో తినాల్సిన క్రిస్పీ మొక్కజొన్న పకోడి
చలి కాలంలో తినాల్సిన క్రిస్పీ మొక్కజొన్న పకోడి