Visakhapatnam: మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా.. యాప్ లో హయ్ అంటే చాలు.. వెతికి మరీ సేఫ్ గా అందిస్తున్న పోలీసులు..

మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశాఖ పోలీసులు రూపొందించిన యాప్ లో హాయ్ అంటే చాలు.. మీకోసం పోలీసులు మేమున్నామంటూ వెతకడం ప్రారంభిస్తారు. మీరు చేయాల్సింది చాలా సింపుల్.

Visakhapatnam: మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా.. యాప్ లో హయ్ అంటే చాలు.. వెతికి మరీ సేఫ్ గా అందిస్తున్న పోలీసులు..
Cell Phone Theft
Follow us
Surya Kala

|

Updated on: Dec 22, 2022 | 2:16 PM

అరచేతిలో ప్రపంచమంతా నిక్షిప్తమైన మొబైల్ ఫోన్ తో… సగటు వ్యక్తికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా, స్నేహితుడిగా ఇమిడిపోయింది. అటువంటి మొబైల్ ఒకసారి పోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ.. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగలేక చాలామంది వాటిపై ఆశలు వదిలేసుకుంటారు. కానీ విశాఖ పోలీసులు రూపొందించిన యాప్ లో… ‘హాయ్’ అంటే చాలు పోయిన ఫోన్లను వెతికి తెచ్చి మరి మీకు సేఫ్ గా అప్పగిస్తున్నారు. నెలన్నర కాలంలోనే వందకు పైగా మొబైల్ ఫోన్లను ఇలాగే రికవరీ చేశారు పోలీసులు.

మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశాఖ పోలీసులు రూపొందించిన యాప్ లో హాయ్ అంటే చాలు.. మీకోసం పోలీసులు మేమున్నామంటూ వెతకడం ప్రారంభిస్తారు. మొబైల్ ఫోన్లో పోగొట్టుకున్న వారు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. వాట్సాప్ నెంబరు 9490617916 కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు. ఆ మెసేజ్ పంపిన వెంటనే ఒక లింకు వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది.

మీరు చేయాల్సింది చాలా సింపుల్. పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదులు చేసి అప్లికేషన్ అంతా నింపి జిరాక్స్ కాపీలు అంతా జోడించాల్సిన అవసరం లేదు. కేవలం మీకు వచ్చిన లింక్ క్లిక్ చేసినా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే చాట్ బోట్ పేరుతో వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో జిమెయిల్ ద్వారా లాగిన్.. అయిన తర్వాత అందులో మొబైల్ పోగొట్టుకున్న వారి వివరాలు మొబైల్ నెంబర్ తో పాటు ఐఎంఈఐ నెంబర్, ఏరియా పోలీస్ స్టేషన్, అడ్రస్ లాంటి కొన్ని వివరాలు పొందుపరిస్తే చాలు. మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ట్రాక్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ప్రత్యేక టీం ఒకటి పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలా గడచిన నెలన్నర క్రితం ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. విశాఖ వాసుల నుంచి భారీ స్పందన కూడా వస్తోంది. కేవలం నెలన్నర వ్యవధిలోనే 1400 వరకు ఫిర్యాదులు అందాయి. విశాఖలో పోయిన మొబైల్ ఫోన్లో కోసం వెరిఫై చేసేసరికి.. కేవలం విశాఖలోనే కాదు ఏపీలోనే కాదు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయా ఫోన్లో ఉన్నట్టు గుర్తించగలిగారు. వాటిలో ఇప్పటికే వందకు పైగా ఫోన్లను రికవరీ చేసి సేఫ్ గా ఫోన్ యజమానులకు అందించారు పోలీసులు.

ఒక మొబైల్ ఫోన్లో,. చిత్రాలను కొంతమంది జ్ఞాపకాలతో బదులుపరచుకుంటే… మరి కొంతమంది ఆ మొబైల్ పైనే తన జీవితం ఆధారపడినట్టుగా భావిస్తారు. మరి కొంతమంది ఆ మొబైల్స్ల ద్వారానే వృత్తిపరమైన వ్యవహారాలు కూడా చూసుకుంటారు. ఎప్పటికప్పుడు యాప్లతో అప్డేట్ చేసుకుంటూ తమ జీవనోపాధి, వ్యాపారం ఉద్యోగ వ్యవహారాలు చూసుకుంటారు. మరికొందరు ప్రాణ స్నేహితులకు గిఫ్ట్ గా కూడా మొబైల్స్ ని ఇస్తుంటారు. అటువంటి మొబైల్ ఫోన్ ఒక్కసారి పోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. చాలామంది జీవితాలు మొబైల్ ఫోన్ తో కూడా ముడిపడి ఉంటాయి. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్తో.. మొబైల్ లోను తిరిగి పొందేవారు ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. ఇక పోయిన మొబైల్ దొరకదులే అనుకున్న సమయంలో… ప్రాణానికి సమానంగా భావించే మొబైల్ తిరిగి వెతికి పెట్టినందుకు సిటీ పోలీస్ కి చేతులెత్తి నమస్కరిస్తున్నారు బాధితులు.

తమవి కాని మొబైల్ ఫోన్స్ ను ఉంచుకున్న వారు నేరస్తులు కావచ్చు అని మీరు భావిస్తారు. కానీ.. ఒకసారి మీ నుంచి పోయిన మొబైల్ ఫోను చేతులు మారిపోతూ ఉంటుంది. అవసరమైన వారు కొనుగోలు చేసిన కొంతమంది అయితే, దొరికిన ఫోన్ పై మోజుపడి పెట్టుకున్న వారు మరికొందరు. అయితే ఏదైనా సరే., తమది కాని వస్తువునైనా, ఎవరైనా చవకగా డాక్యుమెంట్లు లేకుండా మొబైల్స్ అమ్మకాలు చేసిన అటువంటి సమాచారాన్ని అందించాలంటున్నారు పోలీసులు. లేకుంటే చిక్కుల్లో చిక్కుకోక తప్పదని సాఫ్ట్ గా హెచ్చరిస్తున్నారు.

Reporter: Khaja

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో