Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాపుల రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీ.. ఓబీసీ రిజర్వేషన్లలో రాష్ట్రాలకు అధికారం ఉందని స్పష్టత..

ఉభయ తెలుగురాష్ట్రాల్లో గత కొంత కాలంగా రిజర్వేషన్ల అంశంపై తీవ్ర చర్చనడుస్తోంది. ఏపీ కాపు రిజర్వేషన్లు, తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచడం ఇలా రిజర్వేషన్లకు సంబంధించి తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో..

Andhra Pradesh: కాపుల రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీ.. ఓబీసీ రిజర్వేషన్లలో రాష్ట్రాలకు అధికారం ఉందని స్పష్టత..
Chandrababu Naidu (File Photo)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 22, 2022 | 10:57 AM

ఉభయ తెలుగురాష్ట్రాల్లో గత కొంత కాలంగా రిజర్వేషన్ల అంశంపై తీవ్ర చర్చనడుస్తోంది. ఏపీ కాపు రిజర్వేషన్లు, తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచడం ఇలా రిజర్వేషన్లకు సంబంధించి తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో గత తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టంపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పార్లమెంట్‌ వేదికగా కాపుల రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇస్తూ.. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. దీంతో పాటు BC రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. కాపులు, బీసీల రిజర్వేషన్లపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు జీవీఎల్.నరసింహరావు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు జీవీఎల్ ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ప్రతిమా భూమిక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం వివరించింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినది అని.. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చేసిన చట్టం చట్టబద్ధమైనదే అని తెలిపింది.

భారత రాజ్యాంగ 103వ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలిపింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని సూచించింది. కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం లేదని తెలిసి కూడా వైసీపీ, టీడీపీ కాపులను దశాబ్దాలుగా మోసం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్‌.నరసింహరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..