AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్యయ్యో.! సముద్ర తీరం వెంబడి కుప్పలు తెప్పలుగా తాబేళ్ల కళేబరాలు.. రీజన్ తెలిస్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓడలరేవు, కొమరగిరిపట్నం తీర ప్రాంతాల్లో..

Andhra Pradesh: అయ్యయ్యో.! సముద్ర తీరం వెంబడి కుప్పలు తెప్పలుగా తాబేళ్ల కళేబరాలు.. రీజన్ తెలిస్తే..
Olive Ridle Turtles
Ravi Kiran
|

Updated on: Dec 22, 2022 | 10:24 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓడలరేవు, కొమరగిరిపట్నం తీర ప్రాంతాల్లో ఎంతో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ఇక బీచ్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు తీరం వెంబడి చనిపోయి పడి ఉన్న తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. సంతానోత్పత్తి కోసం గుడ్లు పెట్టేందుకు బంగాళాఖాతం సముద్ర తీరానికి చేరుకుంటాయి. రాత్రి సమయాల్లో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి.. ఆ తర్వాత ఇసుకతో వాటిని కప్పుతాయి. అనంతరం మళ్ళీ తిరిగి సముద్ర జలాల్లోకి వెళ్లిపోతాయి.

నవంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు ఇవి తీరంలో గుడ్లు పెట్టే సమయం కావడంతో అటవీ శాఖ అధికారులు వీటికి రక్షణ కల్పిస్తారు. అయితే మత్స్యకారుల నిషేధిత వలలు ఈ తాబేళ్లకు యమపాశాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతుండటంతో వన్యప్రాణ, జంతు రక్షకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ అరుదైన తాబేళ్ల సంతతి నశించిపోకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. అరుదైన ఉభయచర జీవుల్లో తాబేళ్లు కూడా ఒకటి. వీటిల్లో అనేక రకాల జాతులున్నాయి. అందులో ఆలివ్‌ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉంటాయి. ఈ తాబేళ్లు గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్