Women’s Beauty: అమ్మాయిల అందాన్ని దేనితో కొలుస్తారో తెలుసా.. దీంతో పక్కా లెక్క తెలుస్తుంది..

ప్రతి వస్తువుని కొలిచేందుకు ఎన్నో పరికరాలున్నాయి. బరువును కొలిచేందుకు ఓ రకమైన పరికరం, నాణ్యతను కొలిచేందుకు మరో రకమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ పరికరాల్లో అనేక కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఏ కంపెనీ పరికరంతో కొలిచినా.. ఫలితం దాదాపుగా..

Women's Beauty: అమ్మాయిల అందాన్ని దేనితో కొలుస్తారో తెలుసా.. దీంతో పక్కా లెక్క తెలుస్తుంది..
Beauty Girl (Representative Image)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 20, 2022 | 7:24 PM

ప్రతి వస్తువుని కొలిచేందుకు ఎన్నో పరికరాలున్నాయి. బరువును కొలిచేందుకు ఓ రకమైన పరికరం, నాణ్యతను కొలిచేందుకు మరో రకమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ పరికరాల్లో అనేక కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఏ కంపెనీ పరికరంతో కొలిచినా.. ఫలితం దాదాపుగా అతి స్వల్ప తేడా మినహిస్తే ఒకేలా వచ్చే అవకాశాలు ఎక్కువ. మన శరీరంలో వివిధ భాగాల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి సైతం ఎన్నో ఆరోగ్య పరీక్షలు, వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరి గుండె ఎలా పనిచేస్తోంది. ఏ వ్యక్తి ఏ సమస్యలతో బాధపడుతున్నారో కూడా తెలిపే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కాని ఓ మనిషి అందాన్ని కొలవడానికి కూడా ఓ పరికరం ఉంది. ఏమిటి.. అవునా.. ఎలా కొలవచ్చు.. ఆ పరికరం ఎక్కడ దొరుకుందా.. త్వరగా కొనేద్దాం అనుకుంటున్నారా.. ఆ పరికరం మార్కెట్లో దొరికేది కాదు.. కాని పక్కాగా లెక్కను అంచనా వేసే పరికరం మాత్రం ఒకటుందనేది వాస్తవం ఇంతకీ ఆ పరికరం ఏమిటో తెలుసుకుందాం.

అమ్మాయిల అందాన్ని చూసి అబ్బాయిలు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే ఓ అబ్బాయికి నచ్చిన అమ్మాయి మరో అబ్బాయికి నచ్చాలని లేదు. మరి ఓ అబ్బాయికి నచ్చిన అమ్మాయి మరో అబ్బాయికి ఎందుకు నచ్చదనే అనుమానం రావచ్చు. ఎందుకంటే అమ్మాయి అందాన్ని కొలిచే పరికరంపై ఫలితం ఆధారపడి ఉంటుంది. అదేనండి అబ్బాయి మనసు.. అందరి మనస్సులు, మనస్థత్వాలు ఓకేలా ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే ఓ అబ్బాయి మనస్సుకు నచ్చిన అమ్మాయి మరో అబ్బాయికి నచ్చకపోవచ్చు. ఓ వ్యక్తి తన మనస్సు మాటను మాత్రమే వింటాడు. ఇతరులు ఎన్ని మాటలు చెప్పినా.. చివరకు తన మనస్సు ఏం చెబుతుందో ఆ వ్యక్తి అది మాత్రమే చేస్తాడు. అబ్బాయిల మనసు అమ్మాయి యొక్క అందాన్ని కచ్చితంగా అంచనా వేస్తోంది. ఓ సారి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడంటే.. అప్పుడే ప్రేమ కూడా చిగురిస్తుంది. ఇది కేవలం అబ్బాయికి మాత్రమే పరిమితం కాదు. అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది.

చాలా మంది అమ్మాయిలు తమ భాగస్వాములను లేదా ప్రేమికులను ఎంచుకునేటప్పుడు ముందు చూసేది అబ్బాయి అందం. ఓ సారి అబ్బాయి అందానికి అమ్మాయి కనెక్ట్‌ అయిందంటే మాత్రం.. ఇక తన జీవితం ఆ అబ్బాయితోనే అని ఫిక్స్‌ కావడం పక్కా. అందుకే కొంత మంది వ్యక్తులు ఎన్ని పెళ్లి సంబంధాలకు వెళ్లినా.. వివాహం కుదరడం కష్టం అవుతుంది. అందుకే కొంతమందిని ముదర బెండకాయలు అని వెక్కిరిస్తూ ఉంటారు. అయితే దానికి కారణం అందం ఒకటే అని చెప్పలేం. అది ఒక భాగం మాత్రమే కావచ్చు. కొంతమంది అబ్బాయిలు పెళ్లి చూపులకు వెళ్తే.. అమ్మాయిలు వెంటనే తాను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానంటూ తల్లిదండ్రులకు చెప్పేస్తుంటారు. ముఖ్యంగా తన ప్రేయసిని లేదా ప్రియుడిని లేదా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు మనస్సు అనే శరీరంలోని ఒక భాగం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే మనస్సు చెప్పిన మాట వినడం వల్లే.. ఇంతకు ముందు పరిచయం లేకపోయినా, జీవిత భాగస్వామితో జీవితాంతం జీవించడానికి ఓ కారణమని సైకాలజిస్టులు చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

ఏది ఏమైనా ఓ అమ్మాయి లేదా అబ్బాయి అందాన్ని అంచనా వేసేది మనసు మాత్రమే. అందుకే చాలా మంది ఏదైనా తుది నిర్ణయం తీసుకునేటప్పుడు మనస్సుతో ఆలోచించమని చెబుతుంటారు. ఏదైనా మాట చెప్పినా మనస్ఫూర్తిగా చెప్పమంటారు. దానికి ప్రధాన కారణం మనస్సు అనే భాగం ఓసారి పలానా పనిచేయమని ఫిక్స్‌ చేస్తే.. దానికి ఆ వ్యక్తి కట్టుబడి ఉంటాడని అర్థం. అలాంటి పరికరం అమ్మాయి అందాన్ని అంచనా వేసి పక్కా లెక్క తేలుస్తుందనేది ఓ అంచనా.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..