Janasena: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పంచతంత్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జనసేన..

వ్యూహాలు కంటికి కనిపించవు.. ఒక వేళ కనిపించినా అది వ్యూహమని తెలియదు. ఈ విషయం పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నో సందర్భాలలో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే రకరకాల వ్యూహాలు వేస్తున్న జనసేనాని.. ఒక దాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నారు.

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. పంచతంత్ర వ్యూహంతో ముందుకెళ్తున్న జనసేన..
Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Dec 20, 2022 | 7:11 PM

వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలాగైనా గెలిపించాలని.. సీఎం పదవి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేనాని. దీని కోసం ఓ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఐదు… ఐదే ఐదు కార్యక్రమాల ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.ఇంతకీ ఆ ఐదు కార్యక్రమాలు ఏమిటి..? వాటి వల్ల జనసేనకు ఉపయోగం ఏమిటి..? వ్యూహం నేను వేస్తా.. నన్ను నమ్మండి అని పదే పదే అంటుంటారు పవర్ స్టార్. ఇంతకీ ఏమిటా వ్యూహమో చాలా మందికి తెలియదు. వ్యూహాలు కంటికి కనిపించవు.. ఒక వేళ కనిపించినా అది వ్యూహమని తెలియదు. ఈ విషయం పవన్ కల్యాణ్ స్వయంగా ఎన్నో సందర్భాలలో చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటికే రకరకాల వ్యూహాలు వేస్తున్న జనసేనాని.. ఒక దాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నారు. అయితే వాటిని వ్యూహాలు అనడం కంటే తంత్రాలు అంటే బాగుంటుందేమో.. ఎన్నికల లో జనసేనను గెలిపించే ఆ తంత్రాలపైనే ఇప్పుడు పవర్ స్టార్ ఫోకస్ పెట్టారని సమాచారం. మొత్తం పంచ తంత్రాలు జనసేన ఇప్పుడు గెలిపిస్తాయని భావిస్తున్నారు జనసేన నేతలు. ఈ పంచతంత్రాల్లో ఇప్పటికే రెండు అమలవుతుండగా.. మరో మూడు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ఇంతకీ ఏమిటా పంచతంత్రాలు..? దాని వల్ల ఉపయోగం ఏమిటి..?

ప్రజల్లోకి వెళ్లడం, వారి కష్టాలను తెలుసుకోవడం, వీలైనంత సహాయం చేయడం కోసం జనసేన నిర్వహిస్తున్నా.. నిర్వహించనున్న కార్యక్రమాలే ఈ పంచతంత్రాలు.వీటిలో మొదటిది జనవాణి కాగా.. రెండుదో కౌలు రైతు భరోసా యాత్ర. ఈ రెండు ఇప్పటికే జనసేన ఫాలో అవుతోంది. ఇక పంచతంత్రాల్లో మూడోవది యువశక్తి కార్యక్రమం. పవన్ కల్యాణ్ కు కొండంత అండగా ఉండేది యువత. వారిని ఓ సిస్టమేటిక్ పద్ధతిలోకి తీసుకొచ్చి పార్టీ గెలుపుకోసం వారు పనిచేసేలా చేయనున్నారు సేనాని. దీని కోసం జనవరి 12న యువశక్తి సభ నిర్వహించనున్నారు. దానితో పాటు ప్రత్యేక కమిటీలు నియమించనున్నారు.

ఇక పంచతంత్రాల్లో నాలుగోది..ప్రస్తుతానికి సీక్రెట్ ఉంచారు. దీనిని స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.పాలన సాగిస్తున్న అధికార పక్ష నేతల అవినీతి చిట్టా సేకరణ నల్గోది గా ఉండొచ్చని గుసగుస. దీని తర్వాత ముఖ్యమంత్రి పంచతంత్రాల్లో ఐదోవది .. వారాహి. పవన్ కల్యాణ్ నిర్వహించే బస్సు యాత్రే పంచతంత్రాల్లో అతి ముఖ్యమైంది. వచ్చే ఏడాది తర్వాత ప్రారంభించి ఎన్నికల వరకు బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ పంచ తంత్రాలను ఫాలో అయితే పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. మరి జనసేన పంచతంత్రాలు ఎంత వరకు పార్టీకి ఉపయోగపడతాయి.. అధికారంలోకి ఎలా తీసుకువస్తాయో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

Reporter: Vikram

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ