AP Weather: రాగల 2 రోజుల్లో ఏపీలో పొడి వాతావరణమే.. ఆ ప్రాంతాల్లో మరింత పెరగనున్న చలి తీవ్రత
రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పొడి వాతావరణమే ఉండనుంది.
ఆంధ్ర ప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణములలో ఈశాన్య/తూర్పు గాలులు బలంగా వీస్తాయి. అలాగే దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ మధ్య భాగాలపై అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం తో హిందూ మహాసముద్రం మిడ్ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు కొనసాగుతుంది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో పొడి వాతావరణమే ఉండనుంది. అయితే ఆయా ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోతోంది. పొగమంచు కుమ్మేస్తుండడంతో రహదారులు కనిపించడం లేదు. దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో వాతావరణానికి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేక సూచనలు జారీ చేసింది. దీని ప్రకారం
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
మంగళ, బుధ, గురువారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
మంగళ, బుధ, గురువారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
రాయలసీమ
మంగళ, బుధ, గురువారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..