AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Grand Finale: మరికాసేపట్లో మూడు ముళ్లు.. పెళ్లి కూతురు గెటప్‌లో బిగ్‌బాస్‌ ఫినాలేకు వచ్చిన యాంకరమ్మ

షో ప్రారంభంలో చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్న నేహా ఆ తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేదు. అలాగే కొన్ని పొరపాట్లతో మూడో వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ఆతర్వాత మళ్లీ యాంకర్‌ గా బిజీగా మారిపోయింది. ఆతర్వాత పెళ్లిగోల వీడియోతో తనకు కాబోయే వరుడిని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది.

Bigg Boss 6 Grand Finale: మరికాసేపట్లో మూడు ముళ్లు.. పెళ్లి కూతురు గెటప్‌లో బిగ్‌బాస్‌ ఫినాలేకు వచ్చిన యాంకరమ్మ
Anchor Neha Chowdary
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2022 | 7:42 PM

స్టోర్ట్స్‌ యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నేహా చౌదరి. పలు టీవీ ఛానెళ్లలో పని చేసిన ఆమె2020-21లో జరిగిన ఇండియన్​ప్రీమియల్ లీగ్ కు స్టార్ స్పోర్ట్స్​తెలుగులో యాంకర్​గా మోస్ట్​పాపులర్​ అయ్యింది. అంతకుముందు కొన్ని క్రికెట్‌ మ్యాచ్‌ల్లోనూ హోస్ట్‌గా, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గానూ విధులు నిర్వర్తించింది. ప్రో కబడ్డీ సీజన్‌లోనూ తెలుగు హోస్ట్‌గా ఆకట్టుకుందీ యాంకరమ్మ. ఇదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ తెలుగు 6 సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. షో ప్రారంభంలో చక్కటి ఆట తీరుతో ఆకట్టుకున్న నేహా ఆ తర్వాత అంతగా పర్ఫామ్ చేయలేదు. అలాగే కొన్ని పొరపాట్లతో మూడో వారమే హౌజ్ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ఆతర్వాత మళ్లీ యాంకర్‌ గా బిజీగా మారిపోయింది. ఆతర్వాత పెళ్లిగోల వీడియోతో తనకు కాబోయే వరుడిని పరిచయం చేసి వార్తల్లో నిలిచింది. తన చిన్ననాటి స్నేహితుడు అనిల్‌ తో కలిసి పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవాళ (డిసెంబర్‌ 18) రాత్రి 10 గంటలకు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్‌ చేశారు. సాధారణంగా ఇలాంటి సమయంలో వధూవరులు తమ ముస్తాబు పనుల్లో బిజీగా ఉంటారు. అయితే ఇంతటీ బిజీ సమయంలోనూ బిగ్‌ బాస్‌ షోలోకి అడుగుపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది నేహా. పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఆమెను గ్రాండ్‌ ఫినాలేలోకి సాదరంగా ఆహ్వానించాడు బిగ్ బాస్ హోస్ట్‌ నాగార్జున.

ఈ సందర్భంగా మాట్లాడిన నేహా ‘ బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరనేది ప్రకటించే సమయానికి నా మెడలో మూడు ముళ్లు పడనున్నాయి. పది గంటలకు నాకు పెళ్లైపోతుంది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అనిల్‌నే పెళ్లాడబోతున్నా.ఇంకో ఏడాదిదాకా పెళ్లిని వాయిదా వేద్దామనుకున్నా, కానీ తప్పలేదు. విధి ఆడిన వింత నాటకంలో బలిపశువు అయిపోయాను’ అని చెప్పుకొచ్చింది. దీనికి బలిపశువు అయ్యేది నువ్వా? అతడా? అని నాగ్‌ కౌంటరివ్వడంతో బిగ్‌ బాస్‌ సెట్లో నవ్వులు విరబూశాయి. కాగా చివర్లో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లందరినీ తన రిసెప్షన్‌కు హాజరుకావాలని కోరింది నేహా. మొత్తానికి ఇంత బిజీలోనూ నేహా బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు రావడం గ్రేట్‌ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..