Bigg Boss 6 Grand Finale: ఫ్లర్టింగ్‌లో రవితేజ మాస్టర్ అన్న నాగ్.. మాస్ రాజా ఇచ్చిన కౌంటర్ నెక్ట్స్ లెవల్
సీనియర్ నటి రాధ, మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల, మరో హీరో నిఖిల్ అతిథులుగా వచ్చారు. అయితే ట్రోఫి ఇచ్చేది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
బిగ్ బాస్ ఫినాలే ప్రొమో వచ్చేసింది. పక్కా పవర్ పాక్డ్‌గా ఉంది. కావాల్సిన మసాలాలు అన్ని జొప్పించారు. ఒకప్పటి హీరోయిన్ రాధా గెస్ట్‌గా వచ్చారు. నిఖిల్ సిద్ధార్థ్ కూడా వచ్చాడు. పక్కా మాస్ మాసాలా విషయమేమిటంటే మాస్ మహరాజా రవితేజ, శ్రీలీల కూడా అతిథులుగా వచ్చారు. సూట్ కేసు ఆఫర్ అందించే వ్యక్తిగా హౌస్ లోపలికి వెళ్లారు రవితేజ. మరి ఆ సూట్‌కేసులో ఎంత అమౌంట్ ఉంది. దాన్ని ఎవరైనా స్వీకరించారా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
కాగా రవితేజ్ తన మాస్ పంచ్‌లతో రచ్చ చేశారు. హోస్ట్ నాగార్జున గెస్టులకు హౌస్‌మేట్స్‌ను పరిచయం చేసే క్రమంలో.. శ్రీహాన్‌ను ఫ్లర్టింగ్‌లో కింగ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో రవితేజ.. డూ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ అంటూ శ్రీహాన్‌కు సజీషన్ ఇచ్చారు. వెంటనే అందుకున్న నాగార్జున ఆ స్కూల్‌లో రవితేజ మాస్టర్ అని పంచ్ వేశాడు. రవితేజ ఏమైనా తక్కువ తిన్నాడా.. అసలే గోదావరి జిల్లావాడు. దీంతో మీరు తక్కువ బాగా, మీకేం తెలియదు పాపం అంటూ నాగ్‌ను ఉద్దేశించి అన్నాడు. దీంతో నాగ్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఫిమేల్ ఫాలోయింగ్ విషయంలో నాగార్జున ఎంత ప్రోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే.. రవితేజ అలా అన్నాడు.
ఇక బిగ్ బాస్ విజేత ఎవరు అనేది తేల్చింది నటుడు నిఖిల్. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి ఐదుగురు ఫైనలిస్టులతో నాటు స్టెప్పులేసిన నిఖిల్.. చివరికి విన్నర్ ఎవరు అనేది తేల్చేశాడు. గెలిచిన వ్యక్తి నెత్తిపై ఎరుపు రంగు టోపీ పెట్టేశాడు. మరి ఆ టోపీ ఎవరి తల మీద పెట్టారనేది ఫినాలే ఎపిసోడ్‌లో చూడాలి. ఊర్వశి రౌతెలా డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ అవ్వనుంది. ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన సభ్యలతో నాగార్జున ఆటలు, పాటలు అలరించనున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..