AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Winner: బిగ్ బాస్ విజేతగా అవతరించిన రేవంత్.. ఆఫర్ యూజ్ చేసుకుని బయటకు శ్రీహాన్

ఆదివారం జరిగిన బిగ్‌బాస్‌ సీజన్‌-6 ఫినాలేలో సింగర్ రేవంత్‌ విన్నరర్ అయ్యి.. ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఫైనల్‌లో సూట్‌కేట్ ఆఫర్‌ను వినియోగించుకుని బయటకు వచ్చేశాడు శ్రీహాన్.

Bigg Boss 6 Winner:  బిగ్ బాస్ విజేతగా అవతరించిన రేవంత్.. ఆఫర్ యూజ్ చేసుకుని బయటకు శ్రీహాన్
Bigg Boss Telugu 6 Winner Revanth
Ram Naramaneni
|

Updated on: Dec 18, 2022 | 10:35 PM

Share

అనుకున్నదే జరిగింది. సింగర్ ఎల్ వీ రేవంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నరయ్యాడు. 95 శాతం వీక్షకులు అతడే విన్నర్ అవుతాడని ముందే ఫిక్సయ్యారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అలానే ప్రొజెక్ట్ చేశారు. తొలి నుంచి కసితో ఆడాడు రేవంత్. కొన్నిసార్లు అయితే తప్పు, ఒప్పులను కూడా వదిలేశాడు. ఎలా గెలిస్తే ఏంటి.. విన్నర్ మాత్రం అవ్వాలనుకున్నాడు. టాస్క్ ఇస్తే అవతల ఉన్నది ఆడా..? మగా..? ఫ్రెండా అని కూడా చూసేవాడు కాదు. నెక్ట్స్ లెవల్ ఎఫర్ట్స్ పెట్టేవాడు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు సైతం ఎదుర్కున్నాడు. ఫిజికల్ టాస్క్  ఇస్తే చెలరేగిపోయేవాడు.  రేవంత్ భార్య సీమంతం…. బిడ్డ పుట్టడం.. ఇవన్నీ రేవంత్‌కి బాగా కలిసివచ్చాయి. అతడికి ఎమోషనల్ యాంగిల్ యాడ్ చేశాయి. దీంతో కొంత పాజిటివిటీ పెరిగింది.

బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎక్కువసార్లు నామినేట్ అయిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడన్న సాంప్రదాయం ఉంది. కౌశల్, రాహుల్, సన్నీ, అభిజిత్‌లు ఎక్కువ సార్లు నామినేట్ అయ్యి.. విజేతలుగా అవతరించారు. రేవంత్ విషయంలోనూ అదే సాంప్రదాయం కొనసాగింది. రేవంత్ ఈ సీజన్‌లో ఏకంగా 12 వారాలు అతడు నామినేట్ అయ్యాడు. హౌస్‌లో రెండుసార్లు కెప్టెన్ అయ్యింది రేవంత్ సత్తా చాటాడు. ఎక్కువ వారాలు రేషన్ మేనేజర్ ఉంది కూడా అతడే.

సెప్టెంబరు 4వ తేదీ మొదలైన సీజన్‌ 6లో మొత్తం 21 మంది సభ్యలు పోటీ పడగా.. రేవంత్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, కీర్తి భట్‌, రోహిత్‌లు ఫైనలిస్టులుగా మిగిలారు. సూపర్ ఫన్‌తో సాగిన గ్రాండ్‌ ఫినాలెలో మొదట రోహిత్‌, తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్‌ అయి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. టాప్‌-2లో  శ్రీహాన్‌, రేవంత్‌  మిగిలారు.

శ్రీహాన్‌ 40 లక్షల ఆఫర్‌తో బయటకు.. ఓటింగ్‌లో అతడే విన్నర్ 

ప్రైజ్‌ మనీలో సగం అమౌంట్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవచ్చని సూచించారు హోస్ట్ నాగ్. ఫస్ట్ ఇద్దరూ నో చెప్పారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.30లక్షలకు పెంచారు. అప్పుడు కూడా ఇద్దరూ పట్ట వీడలేదు.  ఆ మొత్తాన్ని రూ.40లక్షలకు పెంచారు. 40 లక్షల సూట్‌కేస్ ఆఫర్‌ను స్వీకరించాడు శ్రీహాన్. హౌస్‌మేట్స్‌ మెజార్టీ మెంబర్స్‌తో పాటు పేరెంట్స్ కూడా చెప్పడంతో.. డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు.  దాంతో ఆటోమెటిక్‌గా రేవంత్ విన్నర్ అయిపోయాడు. అయితే ఆడియెన్స్ ఓటింగ్‌లో స్వల్ప  మెజార్టీతో శ్రీహాన్ గెలిచాడని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..