Bigg Boss Adi Reddy: 15 వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఆదిరెడ్డి ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడంటే..
యూట్యూబ్ ద్వారా కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం అయిన ఆదిరెడ్డి.. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యాడు అన్నది వాస్తవం.
కామన్‌మెన్ టూ బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్. ఆదిరెడ్డి ప్రస్థానం నిజంగా ఆదర్శం. తన ఆటతీరు, ప్రవర్తనతో ఎంతో అభిమానులను సంపాదించుకున్నాడు ఉడల్ మామ. తనను ఫినాలే వరకు తీసుకొచ్చిన వీక్షకులకు, అవకాశం ఇచ్చిన బిగ్ బాస్‌కు చేతులెత్తి దండం పెడుతున్నాడు. తన మార్క్ వ్యూహాలు, టాలెంట్‌తో ఫినాలే వరకు దూసుకువచ్చాడు. అప్పుడప్పడు తప్పలు చేసినప్పటికీ.. వాటిని సరిదిద్దుకుంటూ వచ్చాడు. బిగ్‌బాస్ సీజన్ 6లో థర్డ్ రన్నరప్‌గా నిలిచి.. తన సత్తా చాటుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో 15 వారాలు ఉన్నాడు కాబట్టి అతడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బయట ప్రచారం జరగుతున్నట్లుగా అతడికి భారీ పారితోషకం రాలేదట.
15 వారాలకు గాను ఏడున్నర లక్షలు ముట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే వారానికి 50 వేలు అనమాట. వాస్తవానికి చెప్పాలంటే ఆదిరెడ్డికి యూట్యూబ్‌లోనే ఎక్కువ సంపాదన వస్తుంది. అతడికి యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు తన ఫ్యామిలీతో కలిసి చేసే వీడియోలను అందరూ ఇష్టపడతారు. సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ప్రేమలు, ఆప్యాయతలు.. అతడి వీడియోల్లో తొణికిసలాడుతూ ఉంటాయి.
ఇదంతా పక్కనబెడితే అతడికి బిగ్ బాస్ ద్వారా విపరీతమైన పాపులారిటీ వచ్చింది. మరి అతడు ఈ ఫేమ్‌ను ఎలా వినియోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాలవైపు ఇంట్రస్ట్ ఉందా..? లేదా బిగ్ బాస్ రివ్యూవర్‌గా, యూట్యూబర్‌గా కొనసాగుతాడా అన్న ప్రశ్నలకు అతడి నుంచే ఆన్సర్ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..