Bigg Boss Keerthi Bhat: 30 లక్షల ఆఫర్‌ను తృణప్రాయంగా వదులకున్న కీర్తి రెమ్యూనరేషన్ ఎంతంటే..?
15 వారాలపాటు హౌజ్‌లో కొనసాగిన కీర్తి ఎంత పారితోషకం తీసుకుంది అన్నది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. కష్టాల నుంచి వచ్చిన కీర్తి బిగ్ బాస్ ఇచ్చిన డబ్బు ఆఫర్ రిజెక్ట్ చేయడం మరో హైలెట్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. రేవంత్ విన్నర్ అయ్యాడు. శ్రీహాన్.. ఫస్ట్ రన్నరప్. ఇక కీర్తి.. సెకండ్ రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. భాష సరిగ్గా రాకపోయినప్పటికీ.. తన పోరాట పటిమ నిజంగా స్పూర్తిదాయకం. సింపతీ గేమర్ అని కొందరు విమర్శించినప్పటికీ.. ఆమె ఎక్కడా కుంగిపోలేదు. బెండ్ అవ్వలేదు. ఆరోపణలపై తన మార్క్ కౌంటర్స్ ఇస్తూ ముందుకు సాగింది. టాస్కుల్లోనూ తన ప్రతిభ నిరూపించకుంది. వేలు విరిగినా.. ఇబ్బంది ఉన్నా.. అస్సలు తగ్గల్లేదు. ఫినాలేలో రూ. 30 లక్షల ఆఫర్‌ను వద్దనుకుని తనను అభిమానించి.. తోడుగా నిలబడిన వారికి సరైన గౌరవాన్ని ఇచ్చింది. తనకున్న కష్టాలకు ఆ మనీ ఇంపార్టెంట్.. అయినా వదులుకుంది. మొత్తంగా కీర్తి 15 వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉంది. ఈ క్రమంలో ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న టాపిక్ ట్రెండ్ అవుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె వారానికి 70 వేల పారితోషకం అందుకుందట. ఈ లెక్కల 15 వారాలకు 10 లక్షల 50 వేల వరకు ఆమె సంపాదించకుంది. సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తికి ఈ రెమ్యూనరేషన్ పెద్ద లెక్కేం కాదు. కానీ ఆమె తన స్పిరిట్, పట్టుదల లక్షల మంది అభిమానులను గెలుచుకుంది. అది అసలు సంపద. ఆమె కంటే తెలివైన ఆడపిల్లలు ఈ సీజన్‌లో ఉన్నప్పటికీ.. తన మృధు స్వభావం, ఆట తీరుతో 3వ స్థానం సంపాదించుకుంది.
‘కార్తీకదీపం’ సీరియల్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి కీర్తి భట్‌ది కర్ణాటక. ఆమె జీవితం కష్టాలమయం. యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. పిల్లలు కనే అవకాశాన్ని కూడా లేకుండా ఆ దేవుడు లాగేసుకున్నాడు. ఓ బిడ్డను పెంచుకుంటే.. అనారోగ్య కారణాలతో ఆ బిడ్డ సైతం పై లోకానికి వెళ్లిపోయాడు. ఎన్నో కష్టాలున్నా.. హౌస్‌లో ఎంత పోటీ ఉన్నా.. 3వ స్థానంలో నిలిచిన కీర్తి…. యూ ఆర్ ట్రూ ఫైటర్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..