Fifa World Cup 2022 Winner: సాకర్‌ వరల్డ్‌ కప్‌ విజేతగా అర్జెంటీనా.. పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై ఉత్కంఠ విజయం

స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా టీమ్‌లో జోష్‌ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

Fifa World Cup 2022 Winner: సాకర్‌ వరల్డ్‌ కప్‌ విజేతగా అర్జెంటీనా..  పెనాల్టీ షూటౌట్ లో ఫ్రాన్స్ పై ఉత్కంఠ విజయం
Argentina Football Team
Follow us

|

Updated on: Dec 18, 2022 | 11:51 PM

ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా మరోసారి మెరిసింది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.  ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. ముఖ్యంగా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ప్లేయర్‌ డి-మారియా రెండో గోల్‌ చేశాడు. అలా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్‌ కోలుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. కానీ.. సెకండాఫ్‌లో ఫ్రాన్స్ నెమ్మదిగా పుంజుకుంది.  ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంబాపే వరుసగా రెండు గోల్స్ చేసి జట్టును పోటీలో నిలిపాడు. ఇరు జట్లు నువ్వానేనా అని తలపడ్డాయి. దీంతోసెకండాఫ్‌ నిర్ణీత సమయం ముగిసే సరికి ఫ్రాన్స్‌ కూడా రెండు గోల్స్‌ చేయడంతో 8 నిమిషాల సమయం పొడిగించారు.

అయితే అప్పటికీ కూడా స్కోర్లు సమం కావడంతో  మరో 30 నిమిషాలు అదనపు సమయం కేటాయించారు. ఈసారి కూడా 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన నాలుగు గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ రెండో గోల్స్‌​కు మాత్రమే కొట్టగలిగింది. దీంతో అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..